Nagababu : ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలలో నిలిచే వ్యక్తి తమ్మారెడ్డి భరద్వాజ. ఆయన ఆర్ఆర్ఆర్ సినిమాపై తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఈ సినిమా గురించి ప్రపంచం అంతా గొప్పగా మాట్లాడుకుంటోంది. ఇండియన్ సినీ ఇండస్ట్రీతో పాటు ప్రపంచంలోని మన దేశీయులందరూ ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న సమయంలో తమ్మారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్ ఆర్ చిత్రం ఆస్కార్ బరిలో నిలపడానికి చిత్రయూనిట్ రూ. 80 కోట్లు ఖర్చు చేసిందని.. ఆ డబ్బుతో ఎనిమిది సినిమాలు తీసి మొఖాన కొడతామంటూ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన కామెంట్స్ చేశారు.
తమ్మారెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో ఆయనకి దిమ్మతిరిగిపోయే పంచ్‌లు ఇచ్చారు నాగబాబు, రాఘవేంద్రరావు. ఘాటు పదజాలంతో తమ్మారెడ్డి విమర్శలపై రివర్స్ ఎటాక్ చేశారు నాగబాబు. ‘నీ మొగుడు ఖర్చు పెట్టాడారా రూ.80 కోట్లు R R R కి ఆస్కార్ కోసం’ అంటూ ఘాటుగా తన సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అయ్యారు. అయితే ఇందులోనే ఆయన ఆర్ఆర్ఆర్ మీద కామెంటుకు వై.సీ.పీ. వారి భాషలో సమాధానం అంటూ చెప్పటం అగ్నిలో ఆజ్యం పోసినట్లయ్యింది.
ఇక రాఘవేంద్రరావు కొంత కూల్‌గానే స్పందించిన గట్టిగానే హిట్ చేశారు. మిత్రుడు భరద్వాజ్ కి.. తెలుగు సినిమాకు.. తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకు ప్రపంచ వేదికలపై మొదటిసారి వస్తున్న పేరును చూసి గర్వపడాలి అంతేకానీ రూ. 80 కోట్ల ఖర్చు అంటూ చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా..? జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బు తీసుకొని మన తెలుగు సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్ధేశమా ? ” అంటూ ప్రశ్నించారు రాఘవేంద్రరావు. మరి రాఘవేంద్రరావుతో పాటు నాగబాబు చేసిన ఘాటు వ్యాఖ్యలపై తమ్మారెడ్డి ఏమైన స్పందిస్తాడా అనేది చూడాలి.