Payal Rajput : ఆర్ఎక్స్ 100 చిత్రంతో కుర్రాళ్ల మతులు పోగొట్టిన అందాల ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. ఈ అమ్మడు కుర్రాళ్ల కలల రాణిగా మారిందనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత పాయల్ పలు సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. పాయల్ జతకట్టిన పెద్ద హీరోల లిస్ట్ లో వెంకటేష్, రవితేజ మాత్రమే ఉన్నారు. వెంకీ మామ ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేయగా.. డిస్కో రాజా ప్లాప్ అయ్యింది. అత్యంత తక్కువ సక్సెస్ రేట్ కలిగిన పాయల్ ని మెల్లగా దర్శక నిర్మాతలు దూరం పెట్టారు. అడపాదడపా అవకాశాలతో నెట్టుకొస్తున్న పాయల్ కి సరైన బ్రేక్ రావడం లేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలోతెగ సందడి చేస్తుంది.
అయితే ఈ అమ్మడి గురించి పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏపీ04 అనే సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో ఆర్ఎక్స్100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘పాయల్ నా లవర్’ అంటూ హాట్ కామెంట్స్ చేశాడు. ఏపీ04 రామాపురం సినిమా ట్రైలర్ వేడుకలో పాల్గొన్న కమెడియన్ పృథ్వీరాజ్ సందడి చేశారు. అనంతరం అక్కడే ఉన్న బిగ్ బాస్ ఫేమ్ మోడల్ జెస్సీతో సరదగా కామెడీ చేశాడు. జెస్సీని పొగొడుతూ పృథ్వీరాజ్ వ్యాఖ్యలు చేశారు. ” నేను, జెస్సీ మాయ పేటిక సినిమాలో నటించాము. అందులో నేను వచ్చేసి.. పాయల్ రాజ్ పుత్ లవర్ ని. ఇతడు కనిపించిన ప్రతి అమ్మాయిని.. సో స్వీట్ అంటూ కామెంట్స్ చేస్తుంటాడు.
కొద్ది సేపటికే నెంబర్ ప్లీజ్ అంటూ అమ్మాయిలను అడిగేస్తాడు. అది చూసి నేను ఆశ్యర్యపోతుంటాను” అంటూ మాయపేటిక సినిమాకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకున్నారు. ఏపీ04 రామాపురం సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు పృథ్వీ తెలిపాడు. ఈ కమెడీయన్ చాలా సినిమాలలో తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు. ఆర్టిస్ట్ గానే కాకుండా పొలిటికల్ గా కూడా మంచి ఇమేజ్ ను సాధించగా, అనేక వివాదాల్లో కూడా చిక్కుకొని హాట్ టాపిక్ అయ్యాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…