Prudhvi Raj : ఈ నడుమ ఏపీ రాజకీయాల్లో మాటలు హద్దులు దాటిపోయి ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు వేసుకునే పంచ్ లు కూడా హద్దులు మీరుతున్నాయి.. ఇక గత కొంత కాలం నుంచి పవన్ మీద రోజా చేస్తున్న విమర్శలు ఎలా ఉంటున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అయితే రోజాకు కూడా పవన్ అంతే గట్టిగా వార్నింగ్ లు ఇస్తూ వస్తున్నారు. ఏపీ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ విమర్శలు మరింత పీక్స్‌కి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే కమెడీయన్ పృథ్వీరాజ్ రోజాపై విరుచుకుపడ్డారు. గతంలో రోజా పవన్‌ని ఉద్దేశిస్తూ.. పెండ్లి చేసుకోవడానికి విశాఖ పట్నం అమ్మాయి కావాలి. కానీ రాజధానికి మాత్రం విశాఖ పనికి రాదా అంటూ దారుణంగా సెటైర్లు వేసింది. అయితే ఇదే కామెంట్ల మీద నటుడు పృథ్వీ కూడా దారుణంగా విమర్శలు గుప్పించాడు.
చూడమ్మా రోజా.. పవన్ భార్య విషయాన్ని నువ్వు వేలెత్తి చూపిస్తున్నావ్. మరి మొగుడు చెన్నైలో ఉంటున్నాడు మరి చెన్నైలో రాజధాని కడుతావా అంటూ దారుణంగా సెటైర్లు వేశాడు. ఇక తాజాగా మరోసారి రెచ్చిపోయాడు పృథ్వీ.జగన్ నాయకత్వం లేని నాయకుడు. జనసేన స్థాపించినప్పుడే పవన్ నన్ను ఆహ్వానించారు.వైసీపీలో నాకు అన్యాయం జరిగింది. బూతులు మాట్లాడి మానసికంగా దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు. వారు మాట్లాడుతుంటే మా వాళ్లు రెచ్చిపోతున్నారు. వెదవ జైలుకి వెళితే మరో సన్నాసి సపోర్ట్ చేస్తున్నాడు అంటూ రోజా మాట్లాడింది. అది ఎంత వరకు కరెక్ట్. ఇక వాసిరెడ్డి పద్మ మిడిల్ ఫింగిర్ చూపించింది. ఇది కరెక్టేనా. చెప్పాలి అని పృథ్వీ అన్నాడు.
బూతుల యూనివర్సిటీలు వైసీపీలు స్టార్ట్ చేసినవే. రానున్న రోజులలో మంచి ప్రభుత్వం వస్తుంది. ఇక పోసానికి సంస్కారం లేదు. అలాంటి వాడి గురించి మాట్లాడడం వేస్ట్. జనసేనలో అద్భుతమైన నాయకత్వం ఉంది. వారాహి నాలుగో విడత మొదలైంది. ఊసలు కదులుతున్నాయి. జనసేన ఏపీ రాష్ట్రాన్ని వణికిస్తుంది. తెలుగు దేశం కూడా తోడు కావడంతో రాష్రంలో ప్రభంజనం మొదలైంది. వైసీపీకి చరమగీతం మొదలైంది. టీడీపీ జనసేన కలిసాయి. ఇక రానున్న రోజులలో చాలా మార్పు వస్తుందని పృథ్వీరాజ్ అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…