Balakrishna : చంద్రబాబు అరెస్ట్ తర్వాత నందమూరి బాలకృష్ణ రాజకీయాలలో యాక్టివ్ కావడం మనం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సమావేశమయ్యారు. ఇంతకాలం తెలంగాణలో టీడీపీ అజ్ఞాతంలో ఉందని, ఇకపై టీడీపీ జెండా తెలంగాణలో రెపరెపలాడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయని కొందరు ఇప్పుడు తన తండ్రి ఎన్టీఆర్ జపం మొదలుపెట్టారని బాలకృష్ణ చెప్పారు. తెలంగాణలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కొందరు ఇప్పుడు తన తండ్రి ఎన్టీఆర్ జపం మొదలు పెట్టారని బాలకృష్ణ అన్నారు.
త్వరలో తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయని.. ఈ ఎన్నికల సమయంలో ఏపీలో జరిగిన పరిణామాలు, చంద్రబాబు హయాంలో చేసిన తెలంగాణ అభివృద్ధి కలిసి వస్తుందన్నారు. చంద్రబాబు నిజాయితీ గురించి అందరికీ తెలిసిందే. రాజకీయ కక్షతోనే ఆయనపై అబద్ధపు కేసులు పెట్టారన్నారు. రిమాండ్ లోకి తీసుకున్నాక సెక్షన్లు చెబుతున్నారన్నారు. ఏపీలో సైకో పాలన నడుస్తోందన్న బాలకృష్ణ.. ప్రజా సంక్షేమం గాలికి వదిలి ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టే రాజకీయం ఉందన్నారు. 17ఏ సెక్షన్ పాటించకుండా చంద్రబాబును ఎలా అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో కేంద్రం హస్తం ఉందో లేదో తెలియదన్నారు.
అనవసరంగా తాము ఎవరిపైనా నిందలు వేయమని చెప్పిన బాలకృష్ణ… కేంద్రం కల్పించుకోవాల్సిన అవసరం ఉన్న సమయంలో వారు మాట్లాడకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పాఉ.. బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా తన సోదరి పురంధేశ్వరి ఉన్నారని.. ఆమెతో టచ్‌లో ఉన్నామన్నారు బాలకృష్ణ. తప్పకుండా కేంద్రాన్ని ఈ విషయంపై కలుస్తామన్నారు. సినిమా వాళ్లు స్పందించకపోవడాన్ని కూడా పట్టించుకోనని చెప్పారు. ఇక ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ అంటూ బాలకృష్ణ స్పందించారు. రోజా లాంటి వారి స్పందన గురించి మాట్లాడిన బాలయ్య.. ఆమె గురించి మాట్లాడకుండా మౌనంగా ఉండటమే మేలని వ్యాఖ్యానించారు. బురద మీద రాయి వేస్తే మనమీదే పడుతోందని చురకలంటించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…