Prudhvi : కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా ప్రముఖ బిల్డర్ ముమ్మారెడ్డి ప్రేమకుమార్ ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన ఆయన బీజేపీ టికెట్ ఆశిస్తూ ఆరునెలల క్రితం ఆ పార్టీలో చేరారు. కూకట్‌పల్లి టికెట్ పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తున్నట్లు తెలియడంతో ఆయన జనసేనలో ఇటీవల చేరారు. ఈ మేరకు జనసేన నాయకత్వం ప్రేమకుమార్‌ను అభ్యర్థిగా నిర్ణయించారు. ఆయనకు అభిమానులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనని గెలిపించేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కాపునాడు కార్యక్రమం కూకట్ పల్లిలో నిర్వహించగా 30 ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీ కూడా పాల్గొన్నారు.
పృథ్వీ మాట్లాడుతూ.. జనసైనికులకి కృతజ్ఞతల తెలియజేస్తున్నాను. ఇదే ఆఖరి అవకాశం. మన సత్తా చూపాలి. గట్టిగా అరిస్తే ఏం కాదు. మనం పని చేయాలి. కూకట్‌పల్లిలో సెటిలర్స్ ఎక్కువగా ఉన్నారు. సినిమా రంగానికి చెందిన వారు కూడా ఇక్కడ ఉన్నారు. నేను కూడా రేపటి నుండి గడపగడపకి ప్రచారానికి వస్తున్నాను అంటూ జగన్ పెట్టిన కార్యక్రమంపై పంచ్ వేస్తూ ప్రసంగాన్ని కొనసాగించారు పృథ్వీ. ఈ సారి జనసేనని మనందరం కలిసి గెలిపిద్దాం అని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం పృథ్వీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ ఎన్నికల బరిలో బిజెపి తో కలిసి జనసేన బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 8 స్థానాలలో జనసేన పోటీ చేస్తుంది. కూకట్‌పల్లి – ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, తాండూరు – నేమూరి శంకర్ గౌడ్, కోదాడ – మేకల సతీష్ రెడ్డి, నాగర్ కర్నూలు – వంగ లక్ష్మణ్ గౌడ్, ఖమ్మం – మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెం – లక్కినేని సురేందర్ రావు, వైరా (ఎస్టీ) – డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్, అశ్వారావుపేట (ఎస్టీ) – ముయబోయిన ఉమాదేవి లు పోటీ చేస్తున్నారు. వీరంతా గత కొద్దీ రోజులుగా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే తమ అధినేత పవన్ ఒక్కసారైనా ప్రచారంలో పాల్గొంటే బాగుంటుందనే భావనలో ఉన్నారు. ఈ క్రమలో పవన్ కళ్యాణ్ 26న పవన్ కూకట్‌పల్లిలో ప్రచారం చేస్తారని, ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తుంది.