Karthika : సీనియర్ నటి రాధ కూతురు కార్తీక నాయర్ (రంగం ఫేమ్) రోహిత్‌ల పెళ్లి ఆదివారం నాడు కేరళలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. త్రివేండ్రంలో జరిగిన ఈ పెళ్లికి టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. జాకీ ష్రాఫ్, చిరంజీవి, రాధిక, సుహాసిని, రేవతి, మేనక సురేష్ ఇలా చాలా మంది విచ్చేశారు. కార్తీక నాయర్ పెళ్లి ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతున్నాయి. పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను నటి రాధిక తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం కార్తీక పెళ్లి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
పెళ్లిలో వధూవరులు ఇద్దరు తెగ సందడి చేశారు. అయితే పెళ్లి తర్వాత భర్త రోహిత్‌తో కలిసి ఫొటో షేర్ చేస్తూ..మా అందమైన కథ మొదలైంది. మీ ఆశీస్సులకి ధన్యవాదాలు అంటూ కామెంట్ పెట్టింది. ప్రస్తుతం కార్తీక ఫొటోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. దక్షిణాది చిత్రపరిశ్రమలో కథానాయికగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ కార్తీక. జోష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ కాకపోయినా.. ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత జీవా నటించిన రంగం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో టాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, దమ్ము చిత్రాల్లో నటించిన కార్తీకకు అంతగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ అక్కడే బిజీగా ఉండిపోయింది. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న కార్తీక.. వ్యాపారరంగంలో రాణిస్తుంది.
నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమాతొ హీరోయిన్ కార్తీక కూడా వెండితెరకు పరిచయమయ్యింది కార్తీక. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధా వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక..పెద్దగా అవకాశాలు సాధించలేకపోయింది. సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం రాణించలేదు పరిశ్రమలో నిలబడలేక పోయింది. సినిమాలు మానేసి ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న తమ ఫ్యామిలీ హోటల్స్ బిజినెస్ లు చూసుకుంటూ బిజినెస్ ఉమెన్ గా మారిపోయారు.