Prudhvi : ప్రస్తుతం ఏపీలో జగన్‌కి వ్యతిరేఖంగా పలువురు నాయకులు దుమ్మెత్తిపోస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు వ్యూహాల అమలు ప్రారంభించాయి. సీఎం జగన్ ఇంఛార్జ్ ల మార్పుతో పాటుగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా అభ్యర్దులు, మేనిఫెస్టో పైన ఫోకస్ చేసాయి. ఈ సమయంలో వైసీపీ నుంచి జనసేనలో చేరిన సినీ నటుడు పృథ్వీరాజ్ వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో జగన్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ రెడ్డిని.. జగన్ బటన్ రెడ్డి అని ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నారన్నారు.
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ఆయనకు ఎస్వీబీసీ ఛైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. ఆ సమయంలో వచ్చిన ఆరోపణలతో ఆయన్ను తప్పించారు. తరువాతి కాలంలో పృథ్వీరాజ్ జనసేనలో చేరారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దమని..తాడేపల్లి గూడెం నుంచి పోటీ చేస్తానని గతంలో ప్రకటించారు. తాజాగా వైసీపీ ప్రభుత్వం పైన పృథ్వీరాజ్ విమర్శలు గుప్పించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి విజయం తథ్యమని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. కూటమి 135 ఎమ్మెల్యే, 25 ఎంపీ సీట్లతో విజయకేతనం ఎగుర వేస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని మంత్రి అంబటి రాంబాబుకు ముందే అర్థమైపోయిందని చెప్పారు. అందుకే ముందుగానే తెలివితేటలతో ఆయన డ్యాన్సులు వేశాడని గుర్తు చేశారు. సంక్రాంతి సంబరాల్లో లక్ష రూపాయిలు ఇస్తే డ్యాన్సులు వేసి పోతాడంటూ మంత్రి అంబటిపై విరుచుకు పడ్డారు.
ఇక ఇదిలా ఉంటే కమెడియన్ పృథ్వీరాజ్ చేసిన యాడ్ ఫిల్మ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ల్యాండ్ టైటిల్డ్ యాక్ట్ పేరుతో నాయకులు జనాలను ఇబ్బంది పెడుతున్నారంటూ ఈ యాడ్‌లో చూపించారు. కొన్ని పంచ్ డైలాగులతో సెటైరికల్‌గా యాడ్‌ను రూపొందించారు. చివర్లో ఓటుతోనే అన్యాయానికి సమాధానం చెప్పాలనే సందేశాన్ని ఇచ్చారు. అయితే ఇది ఎవరిని టార్గెట్ చేసి తీశారో అని ప్రస్తుతం నెట్టింట చర్చించుకుంటున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…