ఈ రోజుల్లో ప్రేమ పెళ్లిళ్ల విషయంలో తల్లిదండ్రులు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. నచ్చని పెళ్లి చేసుకుంటున్నారనే నెపంతో ప్రేమించిన అబ్బాయిని లేదంటే తన కూతురిని చంపించడానికి కూడా ఏమాత్రం ఆలోచించడం లేదు. కాని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే తన కూతురు ప్రేమించిన వ్యక్తితో వివాహం జరిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. సాధారణంగా రాజకీయ నాయకులు తమ పలుకుబడిని చూపిస్తూ పెళ్లి ఆపేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఈ ఎమ్మెల్యే తన కూతురు వివాహాన్ని నిరడంబరంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చేసి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన కుమార్తె వివాహాన్ని చాలా నిరాడంబరంగా చాలా సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు.
ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ వివాహం చేసి కన్న కూతురుపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తన కూతురు పల్లవితో వచ్చిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వారిద్దరికీ వివాహాన్ని జరిపించారు. కే లీలా గోపీ పవన్ కుమార్‌తో తన మొదటి కుమార్తె రాచమల్లు పల్లవి పెళ్లి చేశారు. అంతకముందు నిరాడంబరంగా , సాంప్రదాయ బద్దంగా బొల్లవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. అనంతరం ప్రొద్దుటూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.
తన మొదటి కుమార్తె పల్లవి ప్రేమ, కులాంతర వివాహానికి ఒప్పుకుని ఆశీర్వదించాను అన్నారు. తన కుమార్తె ఇష్ట ప్రకారం దగ్గరుండి వివాహం చేశానని.. పేదవాడైన పవన్‌ను కలిసి చదువుకున్న రోజుల్లోనే పల్లవి ఇష్టపడటం, అతణ్నే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో.. కుమార్తె ఇష్టాన్ని, నిర్ణయాన్ని గౌరవించి ఈ వివాహం జరిపించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. డబ్బుకు, హోదాకు, కులానికి విలువ ఇవ్వకుండా వారి ఇష్ట ప్రకారమే పెళ్లి చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆడంబరంగా వివాహం చేస్తాను అని తన కూతురికి చెప్పిన అలాంటిదేమీ వద్దు నేను సామాన్యురాలిగా చాలా నిరాడంబరంగానే వివాహం చేసుకుంటానని తన కుమార్తె చెప్పిందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…