Ambati Rambabu : గత కొద్ది రోజులగా చంద్రబాబు వార్తలలో నిలుస్తున్నారు. ఆయన 118 కోట్ల ముడుపులు అందుకున్నాడని, దీనిపై ఇప్పటికే నోటీసులు జారీ చేయగా త్వరలో అరెస్ట్ చేయడం ఖాయమని కూడా అంటున్నారు.ఇదే క్రమంలో చంద్రబాబుకు ఐటీ నోటీసులు..తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ టీడీపీ అధినేత చేసిన కామెంట్స్ పైన వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. చంద్రబాబు చట్టానికి అతీతులు కాదని వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబుకు నోటీసుల వ్యవహారం పై పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించటం లేదని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు సింపథీ గేమ్ ప్రారంభించారని పేర్కొన్నారు.
చంద్రబాబు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని , తన పైన దాడులు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వ్యాఖ్యలు చేయడంతో అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు ఐటీ అడిగిన సమాచారం ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లుగా ఐటీ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. తాజాగా, మంత్రి అంబటి రాంబాబు ఇదే అంశం పైన స్పందదించారు. చట్టం దృష్టిలో చంద్రబాబు అయినా ఒకటే మరో బాబు అయిన ఒకటే అని …చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని మంత్రి అంబటి రాంబాబుఅన్నారు.చట్టం దృష్టిలో చంద్రబాబు అయినా ఒకటే మరో బాబు అయిన ఒకటేనని అంబటి అన్నారు. బహుశా అరెస్ట్ చేస్తారని చంద్రబాబుకు కలవచ్చినట్టుందని మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.
చం ద్రబాబును అరెస్టు చేయాల్సిన అవసరం ఉంటే అరెస్టు చేస్తారని.. అరెస్టు చేయాల్సిన అవసరం లేకపోతే అరెస్టు చేయరని చెప్పుకొచ్చారు. చట్టానికి అడ్డం వస్తే ఆయన్ని కూడా అరెస్టు చేస్తారన్నారు. ప్రాథమిక ఆధారాలు లేనిదే ఎవరి మీద ఏ విధమైన కేసులు పెట్టరన్నారు. చంద్రబాబు తనను అరెస్ట్ చేస్తారని సానుభూతి పొందే మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు దొంగైనా పవన్ కళ్యాణ్ నోరు విప్పడని.. ఆయన హీరోనే అంటారన్నారు. వాళ్ళిద్దరికీ ఉన్న బంధం సంబంధం అలాంటిదని తెలిపారు అంబటి రాంబాబు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…