Priyadarshi : ఇటీవలి కాలంలో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం బలగం. ఈ మూవీకి ప్రతి ఒక్కరు నీరాజనాలు పలికారు. కమెడియన్ వేణు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కెరీర్ ప్రారంభంలో కమెడియన్ గా ప్రేక్షకులకు పరిచయమైన వేణు జబర్దస్త్ షోలో తన కామెడీతో ఎంతోమంది అభిమానులకి వినోదాన్ని పంచాడు. ఈ క్రమంలోనే . వేణు బలగం సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రంలో హీరోగా ప్రియదర్శి, హీరోయిన్ గా కావ్య కళ్యాణ్ రామ్ నటించారు. చాలా సినిమాల్లో హీరోకి ఫ్రెండ్ గా నటించిన ప్రియదర్శి ఈ చిత్రంలో హీరోగా కనిపించి అలరించాడు.
థియేటర్‌లో అలరించిన బలగం ఓటీటీలోను రచ్చ చేస్తుంది. ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అన్ని పాత్రలు అద్భుతంగా ఉన్నాయి. ఇందులో ప్రియదర్శి చేసిన సాయిలు పాత్ర కీలకం. క్లైమాక్స్ లో ప్రియదర్శి నటనకు ప్రశంసలు వస్తున్నాయి. ఇలాంటి సాయిలు పాత్రకు ముందుగా ప్రియదర్శిని అనుకోలేదట. కథను రాసుకున్నప్పుడు కాస్త మార్కెట్ గురించి కూడా ఆలోచించిన వేణు కమర్షియల్ మార్కెట్ ఉన్న హీరో కావాలనే ఉద్దేశంతో శ్రీవిష్ణును హీరోగా తీసుకోవాలని అనుకున్నాడట. అయితే తాను తెలంగాణ భాషన్ పర్ ఫెక్ట్ గా పలకలేననే ఉద్దేశంతో నో చెప్పాడట.
అప్పుడు తర్వతి ఆప్షన్‌గా దర్శిని తీసుకున్నారు. రియలస్టిక్ గా ఉండాలని అనుకున్నప్పుడు ప్రియదర్శి అయితేనే ఈ పాత్రకు న్యాయం చేస్తాడని అతనిని తీసుకోగా, నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. మేకర్స్ అనుకున్నట్టు గానే ఆయన పాత్రలో ఒదిగిపోయాడు అంటూ చెప్పుకొచ్చాడు వేణు. ఇదిల ఉంటే డైరెక్టర్ వేణు బలగం స్టోరీని దిల్ రాజుకు చెప్పిన సమయంలో సాయిలు పాత్రను వేణునే చేయాలని అనుకున్నారట. కానీ తర్వాత ఇతర నటుడిని తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రియదర్శి పేరును దిల్ రాజు సూచించారని ప్రియదర్శి అన్నాడు. అలా సాయిలు పాత్ర తన వరకు వచ్చిందని స్వయంగా ప్రియదర్శి చెప్పాడు. ఒకవేళ వేణునే సాయిలు పాత్ర చేసి ఉంటే ఒక మంచి సినిమాలో తాను భాగం అయ్యే వాడిని కాదని ఓ ఇంటర్వ్యూలో అన్నాడు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…