టాలీవుడ్ కు చెందిన కన్నడ ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఏం పిల్లో ఏం పిల్లడో చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ప్రణీత. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. అయినా అమ్మడికి అవకాశాలు బాగానే వచ్చాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో అత్తారింటికి దారేది, మహేశ్‌బాబుతో బ్రహ్మోత్సవం, జూనియర్ ఎన్టీఆర్ తో రభస, మంచు విష్ణుతో పాండవులు పాండవులు తుమ్మెద, రామ్‌తో హలో గురు ప్రేమకోసమే చిత్రాలతో అలరించింది. గతేడాది హంగామా2, భూజ్ సినిమాలతో బాలీవుడ్లో అడుగుపెట్టింది.
అయితే, ఏ భాషలోనూ ప్రణీత స్టార్ హీరోయిన్గా నిలదొక్కుకోలేకపోయింది. దీంతో బెంగళూరుకు చెందిన నితిన్ రాజ్ అనే ఓ బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకుంది. ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే కరోనా సమయంలో ఫాన్స్ కి తెలీకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది ప్రణీత. ఈ మధ్య ప్రణీత సోషల్ మీడియా ట్రోల్స్ కి గురయ్యింది. ఆమె పండుగ రోజున భర్తకు పాద పూజ చేశారు. ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. దాన్ని కొందరు తప్పుబట్టారు. ఈ రోజుల్లో కూడా భర్తకు పాద పూజలు చేయడం ఏమిటీ..?
ఇది పురుషాధిక్యతను సమర్ధించడమే అని కొందరు విమర్శలు చేశారు. ఆ విమర్శలకు ప్రణీత స్పందిస్తూ సాంప్రదాయాలు పాటించడంలో తప్పు లేదన్నారు. ఏళ్లుగా కుటుంబ సభ్యులు పాటిస్తున్న పద్ధతులు మీకోసం మార్చుకోను అన్నారు. అయితే తాజాగా ప్రణీత సుభాష్ ఫస్ట్ టైం కూతురు ఫోటోలు ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. ఇంస్టాగ్రామ్ లో తన చిన్నారితో దిగిన ఫోటోలు పోస్ట్ చేశారు. దీంతో ప్రణీత పాపాయి ఫోటోలు వైరల్ గా మారాయి. అందంలో అమ్మకు పోటీ ఇస్తున్న క్యూట్ బేబీ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.