గత కొన్ని రోజులుగా మీడియా వార్తల్లోనూ, సోషల్ మీడియాలోనూ బాగా వినిపిస్తున్న పేరు పవిత్ర లోకేష్. ఈమె కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటి అయినప్పటికీ తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే కన్నడ చిత్ర పరిశ్రమలో ఈమె హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించినప్పటికీ శాండిల్ వుడ్ లో హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. ఇక ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు మరియు కన్నడ భాషలో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.
కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు పొందిన నటుడు వి. కె నరేష్ తో పవిత్ర రిలేషన్షిప్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. పవిత్రకి ఇండస్ట్రీలో నరేష్ అండదండలతోనే ఎక్కువగా సినీ అవకాశాలు వస్తున్నాయని, ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమాలో మరోసారి వీరిద్దరూ భార్యభర్తలగా నటించడం కూడా ఒక విశేషం. ఇక ఈ సినిమాతో నరేష్ మరియు పవిత్ర లోకేష్ డేటింగ్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు మరోసారి వైరల్ అయ్యాయి. అయితే గతంలో పవిత్ర ఓ కన్నడ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ ఇంటర్వ్యూ ద్వారా తనకు ఎవరైనా అవకాశాలు కల్పిస్తే చాలా భయమేస్తుందని, అవకాశాలు ఇచ్చేవాళ్ళు తన దగ్గర నుంచి ఏమి ఆశిస్తారో అనే ఆందోళన తనకు ఎక్కువగా ఉంటుందని ఆమె అభిప్రాయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా ఇలా అవకాశం పేరుతో ఓ హీరో తనని బాగా వాడుకొని వదిలేసారని ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. కానీ ఆ స్టార్ హీరో ఎవరు..? అనే విషయం మాత్రం పవిత్ర లోకేష్ బయట పెట్టలేదు.