Prabhas : సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఎంతో ఆసక్తి చూపుతుంటారు. వారు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు? ఎలాంటి బట్టలు ధరిస్తారు? వాటి ధర ఎంత? వాళ్ళు వాడే కార్లు ఎలా ఉంటాయి? వాళ్ళు వాడే వస్తువులు ఎలా ఉంటాయి? ఇలా ప్రతి విషయం మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఇటీవల సీనియర్ హీరోల విగ్గుల విషయంలో ప్రత్యేకమైన ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
వయస్సు మీద పడుతున్నకొద్ది జుట్టు ఊడిపోతుండడం సహజం. సాధారణ ప్రజలు అయితే క్యాప్‌తో తమ బట్టతల కవర్ చేస్తుంటారు. అయితే సెలబ్రిటీలు అయితే వివిధ రకాల పద్దతులలో జుట్టు ఒత్తుగా కనిపించేలా చేస్తుంటారు. ఇప్పటికే మహేష్ బాబు విగ్గు గురించి సూపర్ స్టార్ కృష్ణ మేకప్ మ్యాన్ చేసిన కొన్ని కామెంట్లు వైరల్ అవ్వగా దానిమీద చాలా రోజులపాటు చర్చ జరిగింది. ఇ మధ్య వెంకటేష్ విగ్గు గురించి ఆయన మేకప్ మ్యాన్ కామెంట్ చేయడంతో దాని మీద కూడా చర్చ జరిగింది. ఇక హీరో ప్రభాస్ వాడేది విగ్గే అంటూ ఒక నెటిజన్ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశాడు.
ఆ వీడియోలో ప్రభాస్ జుట్టును ఆయన హెయిర్ స్టైలిస్ట్ సరి చేస్తుండగా, అందరిలోఅనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒరిజినల్ జుట్టు అయితే ఎందుకు ఆయన హెయిర్ స్టైల్స్ట్ అంత డెలికేట్ గా పట్టుకొని జుట్టుని సరి చేస్తాడు అంటూ ఈ వీడియో చూసిన వారందరూ కామెంట్లు చేస్తున్నారు. అయితే సాధారణంగా ఎవరి జుట్టైనా కూడా కొంత వయసు వచ్చిన తర్వాత ఊడిపోతూ ఉండడం సహజం. ఇందులో ప్రభాస్ నిజంగా విగ్గు వాడారా? లేదా? అనే సంగతి పక్కన పెడితే వాడితే నష్టమేముంది? ఒకవేళ అది ఆయన ఒరిజినల్ జుట్టు అయితే విమర్శకులు ఏం చెబుతారు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…