Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయి క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ రీసెంట్‌గా కల్కి అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ సాధించింది. సుమారుగా 620 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా 372 కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ రిపోర్ట్. అయితే ఈ సినిమా సుమారుగా 375 షేర్‌తో బ్రేక్ ఈవెన్ సాధించాల్సిన పరిస్థితిలో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. కల్కి 2898 ఏడీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా 900 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డులకెక్కింది.
ఈ సినిమా ఇంకా స్ట్రాంగ్‌గా వసూళ్లను సాధిస్తుంది. రెండోవారం ముగిసే సమయానికి 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టే ఛాన్స్ పక్కాగా కనిపిస్తున్నది. ఈ సినిమా చాలా చోట్ల బాహుబలి 2 సినిమా రికార్డులకు చేరువగా రాగా.. మరికొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డును క్రియేట్ చేస్తున్నది. అయితే ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ దాన గుణం గురించి కల్కి సినిమాకు కాస్ట్యూమ్ డైరెక్టర్‌గా చేసిన మురళి అనే వ్యక్తి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కల్కి సినిమా కోసం పని చేసిన వేలాది మందికి ప్రభాస్ కోట్ల రూపాయల సాయం చేశాడట. పైగా సెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభాస్ ఇంటి నుంచి భోజనం తెప్పించేవాడట.
‘‘కల్కి సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ప్రభాస్.. రూ.10 వేలు బహుమతిగా ఇచ్చారు. సినిమాకు పని చేసిన అన్ని డిపార్ట్‌మెంట్స్‌కు చెందిన ప్రతి ఒక్కరి వివరాలు తెలుసుకుని.. వారి అకౌంట్‌లో 10 వేల రూపాయల చొప్పున జమ చేశారు. నా కెరీర్‌లో ఇంత వరకు ఇలాంటి హీరోను నేను చూడలేదు. అలానే కల్కి షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు ప్రభాస్ ఇంటి నుంచే అందరికి రుచికరమైన భోజనం తెప్పించే పెట్టేవాడు. నిజంగా డార్లింగ్ లాంటి హీరోను ఇంతవరకు నేను చూడలేదు’’ అంటూ ప్రశంసలు కురిపించాడు మురళి. ఈ విషయం తెలిసిన ప్రభాస్ అభిమానులు ఇందుకు కదా నిన్ను రాజు అనేది అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…