Prabhas Anushka Marriage : వెండితెరపై కొన్ని జంటలు చాలా చూడముచ్చటగా ఉంటాయి. వారిద్దరు కలిసి జంటగా కనిపిస్తే అభిమానులకి కనుల పండుగే. అలాంటి జంట ప్రభాస్- అనుష్కలది. వీరిద్దరు కలిసి మిర్చి చిత్రంలో నటించగా, ఆ తర్వాత బాహుబలి ఫ్రాంచైజీలో కూడా కలిసి నటించారు. అయితే త్వరలో మరో సినిమా చేయబోతున్నారనే ప్రచారం నడుస్తుంది. అయితే సినిమాల విషయం పక్కన పెడితే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన అనుష్క త్వరలోనే ప్రభాస్‌తో ఏడడుగులు వేయనుందని తాజాగా కొన్ని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
![Prabhas Anushka Marriage : మరోసారి వార్తల్లో ప్రభాస్ - అనుష్క పెళ్లి... ఈ సారెప్పుడో..? Prabhas Anushka Marriage yet again in news](http://3.0.182.119/wp-content/uploads/2022/09/prabhas-anushka-marriage.jpg)
ప్రభాస్- అనుష్క పెళ్లి గురించి తాజాగా పుకార్లు హల్‌చల్ చేయడానికి కారణం.. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆ సమయంలో అనుష్క అక్కడికి వచ్చింది. దీంతో ప్రభాస్ – అనుష్కల మధ్య సంబంధం ఉండే ఉంటుందని కొందరు గాసిప్ రాయుళ్లు కథలు అల్లుతున్నారు. వీళ్ళిద్దరూ రహస్యంగా చెట్టా పట్టాలేసుకొని తిరగడం చాలామంది చూశారని, పెళ్లయ్యాక వీళ్ళు ఉండడానికి అమెరికాలో ఇల్లు కూడా నిర్మించుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
అనుష్కని కోడలిగా చేసుకోవడం కృష్ణంరాజుకి చాలా ఇష్టమని, త్వరలో ప్రభాస్- అనుష్క జంట ఒక్కటి కానుందని ఎవరికి నచ్చినట్టు వారు కథలు అల్లేస్తున్నారు. మరి రానున్న రోజులలో పుకార్లని ఈ జంట నిజం చేస్తారా, లేదంటే ఎప్పటి మాదిరిగానే కొట్టి పారేస్తారా అన్నది చూడాలి. ఆ మధ్య ఓ గురూజీ జాతకం ప్రకారం.. అనుష్క వివాహం జనవరి 2023 నాటికి జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇంతకీ వరుడు ఎవరు ? ఏ రంగానికి చెందిన వాడు లాంటి విషయాలేవీ తెలపలేదు.