పొట్ల‌కాయ‌ను ఇలా వండితే.. ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..!

పొట్ల‌కాయ‌ల‌ను తినేందుకు స‌హ‌జంగానే ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. కానీ వీటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. పొట్ల‌కాయ‌ల‌ను స‌రిగ్గా వండాలే కానీ వీటిని ఎవ‌రైనా స‌రే ఎంతో ఇష్టంగా తింటారు. పొట్ల‌కాయ‌ల్లో మ‌న శ‌రీరానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డే ప్రోటీన్లు, ఫైబర్ ఉంటాయి. క‌నుక వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇక పొట్ల‌కాయ‌ల‌ను ఉప‌యోగించి కూర‌ను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పొట్ల‌కాయ పాలు కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పొట్ల‌కాయ – 1, కొబ్బ‌రినూనె – ఒక టీస్పూన్‌, ఉల్లిపాయ త‌రుగు – పావు క‌ప్పు, కారం – ఒక టీస్పూన్‌, కొత్తిమీర – చిన్న క‌ట్ట‌, క‌రివేపాకు – రెండు రెబ్బ‌లు, పాలు – అర క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, తాజా కొబ్బ‌రి తురుము – పావు క‌ప్పు, జీల‌క‌ర్ర – అర టీస్పూన్‌, త‌రిగిన ప‌చ్చి మిర్చి – 2, ఆవాలు – పావు టీస్పూన్‌, ఎండు మిర్చి – 4, ప‌సుపు – పావు టీస్పూన్‌.

potlakaya palu kura recipe how to make it

పొట్ల‌కాయ పాలు కూర‌ను త‌యారు చేసే విధానం..

స్ట‌వ్ మీద బాణ‌లి ఉండి వేడ‌య్యాక కొబ్బ‌రినూనె వేసి కాగాక ఎండు మిర్చి, ఆవాలు, జీల‌క‌ర్ర‌, ప‌సుపు వేసి వేయించాలి. ఉల్లిపాయ త‌రుగు, ప‌చ్చి మిర్చి త‌రుగు, క‌రివేపాకు వేసి ఉల్లి త‌రుగు బంగారు రంగులోకి మారేవ‌ర‌కు వేయించాలి. పొట్ల‌కాయ ముక్క‌లు వేసి మూత ఉంచాలి. ముక్క‌లు బాగా మ‌గ్గాక ఉప్పు, మిర‌ప కారం వేసి క‌ల‌పాలి. కొబ్బ‌రి తురుము, పాలు వేసి మ‌రొక‌సారి క‌లిపి మూత పెట్టి 3 నిమిషాలు ఉడికించాలి. కూర బాగా ద‌గ్గ‌ర ప‌డిన త‌రువాత కొత్తిమీర వేసి దింపేయాలి. దీంతో పొట్ల‌కాయ పాలు కూర త‌యార‌వుతుంది. దీన్ని అన్నం లేదా చ‌పాతీలు.. దేంతో తిన్నా రుచిగానే ఉంటుంది.

Share
editor

Recent Posts

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

6 hours ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 hours ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 day ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

4 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

4 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

4 days ago