Indians In USA : ప్రవాస భారతీయులకి కష్టాలు మొదలైనట్టేనని అర్ధమవుతుంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులతో పాటు అమెరికా వెళ్లిన లక్షలాది మంది భారతీయుల యువతీయువకులు ప్రస్తుతం ఆ దేశబహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. శాశ్వత నివాసార్హత సాధించలేక తాత్కాలిక వీసాలు రాక స్వదేశానికి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు.. అమెరికాలో ఇలాంటి వారిని డాక్యుమెంటెడ్ డ్రీమర్స్‌గా పిలుస్తారు. వీరి మొత్తం సంఖ్య 2.5 లక్షలకు పైనే ఉంటుంది. డాక్యుమెంటెడ్ డ్రీమర్స్‌లో భారతీయులే అత్యధికమని స్వయంగా వైట్ వర్గాలు చెప్పుకురావడం విశేషం. అయితే అమెరికా రూల్స్ ప్రకారం తల్లిదండ్రులతో పాటు అమెరికాకు వచ్చే చిన్నారులను వీసాదారులపై ఆధారపడ్డ వారిగా పరిగణిస్తారు.
21 ఏళ్ల వరకూ వారు దేశంలో ఉండేందుకు అనుమతి ఇస్తారు. ఆలోపు గ్రీన్ కార్డు దక్కితే చట్టబద్ధంగా అగ్రరాజ్యంలో కొనసాగే అవకాశం ఉంటుంది లేదంటే వారి వయస్సు దాటిందని చెప్పి గ్రీన్ కార్డు జాబితా నుంచి తొలగిస్తారు. దీన్ని ‘ఏజ్ ఔట్’గా పిలుస్తారు. ఆ తరువాత గ్రీన్ కార్డు లేదా వీసా కోసం సొంతంగా ప్రయత్నించాలి. ఇందులో విఫలమైతే స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలి. అమెరికాలో ప్రస్తుతం భారతీయులు వారి పిల్లలు సహా మొత్తం1.2 మిలియన్ల మంది వివిధ కేటగిరిల్లో దరఖాస్తు చేసుకుని గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తుండగా, కొందరు భారత సంతతికి చెందిన వారు అమెరికాలోని తమ కుటుంబాలను వీడి భారత్‌లో బంధువుల వద్ద తలదాచుకుంటున్నారు.
డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ సమస్య పరిష్కారానికి రిపబ్లికన్స్ చట్టసభల్లో అడ్డుపడుతున్నారని వైట్ హౌజ్ తెలియజేసింది. అందరికి అనుకూలంగా బిల్లుని తీసుకొస్తే వాటికి రిపబ్లికన్స్ రెండు సార్లు అడ్డుగా నిలిచారని, మాకు వ్యతిరేఖంగా ఓటు వేసారని అన్నారు. గత నెలలో వివిధ పార్టీలకు చెందిన 43 మంది చట్టసభ సభ్యులు.. ఈ సమస్యకు పరిష్కారం కోరుతూ బైడెన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. గ్రీన్ కార్డుల కోసం కొందరు దశాబ్దాల తరబడి వేచి చూస్తున్నారని, సమస్యకు తక్షణ పరిష్కారం కోసం ప్రయత్నించాలని సూచించారు. మరి రానున్న ప్రభుత్వంలో అయిన దీనికి పరిష్కారం అనేది దొరకుతుందా లేదా చూడాల్సి ఉంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…