Toll Gates : ఇప్పుడు హైవేలపై ప్రయాణిస్తుంటే మనకు టోల్ గేట్స్ తప్పక కనిపిస్తాయి. అక్కడ కొంత టోల్ చెల్లించి తిరిగి ప్రయాణం మొదలు పెడతాం. ఒకప్పుడు డబ్బులు చెల్లించే విధానం నుంచి నేడు ఫాస్ట్‌ట్రాక్‌కి అప్‌గ్రేడ్ అవుతూ వచ్చాము. అయితే ఇకపై అసలు టోల్ ఫ్లాజాలే ఉండవు. అదేంటి టోల్ ఫ్లాజాలు లేకపోతే టోల్ ఎలా వసూలు చేస్తారనే సందేహం తప్పక వస్తుంది. అయితే ఇంతకముందులా కాకుండా దేశంలో శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. అసలు ఎలాంటి టోల్ ఫ్లాజాలు లేకుండానే వాహనదారుల బ్యాంకు ఖాతాలో నుంచి డబ్బులు టోల్ రూపంలో కట్ అవుతాయి.
ఒక టోల్ గేట్ వద్ద పాత విధానంతో సగటున ఒక వాహనం గేట్ దాటేందుకు 8 నిమిషాల సమయం పడితే, ఫాస్టాగ్ కారణంగా అది 47 సెకన్లకు పరిమితమైంది. ప్రతి వాహనానికి ‘ఫాస్ట్ ట్యాగ్’ తప్పనిసరి చేయడంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ విధానం కొనసాగుతోంది.త్వరలోనే దేశంలోని అన్ని టోల్ ప్లాజాలను మూసివేసి శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని అమలు చేయబోతున్నట్లు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇంతకీ శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అంటే ఏంటి.? అసలు ఇది ఎలా పనిచేస్తుంది.? ఈ విధానంలో డబ్బులు ఎలా కట్ అవుతాయో చూద్దాం.
శాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్‌లో, కారులో ఇన్‌స్టాల్ చేసిన ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా టోల్ కట్ అవుతుంది. శాటిలైట్ ఆటోమేటిక్‌గా కారు ప్రయాణించిన దూరాన్ని లెక్కిస్తుంది. దీని ఆధారంగా ఎంత టోల్ కట్ అవ్వాలో అంత ఆటోమెటిక్‌గా కట్ అవుతుంది. ఈ వ్యవస్థను శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ సిస్టమ్ లేదా జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ అంటారు. హైవేలపై ఏర్పాటు చేసిన కెమెరాల ఆధారంగా వాహన సమాచారం ఉపగ్రహానికి అందుతుంది. ఆన్ బోర్డ్ యూనిట్‌తో లింక్ చేసిన వాలెట్‌లో ఉండే డబ్బులు టోల్ రూపంలో కట్ అవుతాయి. ఆన్‌బోర్డ్ యూనిట్‌ను వాహనదారులు తమ వాహనాల్లో ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా వచ్చే వాహనాల్లో ఈ వ్యవస్థ ఇన్‌బిల్ట్‌గా వచ్చే అవకాశం ఉంది. కొత్త టోల్ వసూలు విధానం అమలులోకి రావడంతో డ్రైవర్లు టోల్ వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు అని మంత్రి స్పష్టం చేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…