Perni Nani : స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టు అయిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి జైలుకు పంపించడం పై నేడు టిడిపి శ్రేణులు బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో ప్రజలు ఎవరూ బంద్ ను పట్టించుకోవడంలేదని, చంద్రబాబు చేసిన అవినీతి అంతటిదని వైసీపీ మంత్రులు, నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా పేర్ని నాని.. చంద్రబాబుపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. తనను అరెస్టు చేస్తుందనే విషయం టీడీపీ అధినేత చంద్రబాబుకి ముందే తెలుసు అన్నారు వైసీపీ నేత పేర్ని నాని. సంకల్పంతో పనిచేసిన, బలమైన, పట్టుదలతో పనిచేసిన అధికారి చేతిలో చంద్రబాబు దొరికిపోయారని ఆయన అన్నారు.
1977 నుంచి చంద్రబాబు స్కాములు చేశారన్న నానీ.. ఇన్నేళ్లూ పట్టుబడకుండా నక్కజిత్తుల స్టేలు తెచ్చుకుంటూ కాలం నెట్టుకొచ్చారని అన్నారు. చంద్రబాబుకి ప్రతీ వ్యవస్థలో తన మనుషులు, స్లీపర్ సెల్స్ లా ఉన్నారన్న నానీ.. అవినీతికి పాల్పడుతూ.. సమాజానికి నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. 2014-15లో కూడా తెలంగాణలో ఓ ఎమ్మెల్యేకు ఓటుకు లంచం ఇస్తూ.. ఆడియో, వీడియో టేపులతో చంద్రబాబు దొరికిపోయారని అన్నారు నానీ. ఆ కేసులో 10 ఏళ్లపాటూ.. ఏపీ ప్రజలు అనుభవించాల్సిన హైదరాబాద్‌ని కేసీఆర్‌కి అమ్మేసి, చంద్రబాబు డ్రామా ఆడారని అన్నారు. ఇప్పుడు మాత్రం పాపం పండిందన్న నానీ…. సరైన అధికారి చేతికి దొరికారని అన్నారు.
హెలికాప్టర్లో తీసుకు వెళ్తామంటే వద్దని, కావాలని రోడ్డు మార్గంలో హడావుడి చేయొచ్చని రోడ్డు మార్గంలోనే వచ్చారన్నారు .చంద్రబాబు పాపాల భైరవుడు అని యువతకు నైపుణ్యం పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్నాడు అని పేర్ని నాని విమర్శించారు.ఇది మచ్చుకు ఒకటి మాత్రమేనని తీగ లాగితే డొంక కదిలినట్టు చంద్రబాబు చేసిన స్కాములు అన్ని బయటకు వస్తాయని పేర్ని నాని చెప్పుకొచ్చారు.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన బాబు ఎంత గడ్డి కరవడానికి అయినా దిగజారుతారు అని పేర్ని నాని విమర్శించారు. పవన్ కళ్యాణ్, పురందరేశ్వరి చంద్రబాబును కాపాడుకోవడం కోసమే పనిచేస్తున్నారని పేర్ని నాని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టు పేర్ని నాని చెప్పుకొచ్చారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…