Ram Gopal Varma : ప‌వ‌న్ క‌ళ్యాణ్ నా పోస్ట‌ర్ కాపీ కొట్టి అలా రోడ్డుపైన ప‌డుకున్నాడంటూ వ‌ర్మ సెటైర్

Ram Gopal Varma : సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ నిత్యం సెటైరిక‌ల్ కామెంట్స్ చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తుంటారు. ఆయ‌న ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఎక్కువ‌గా టార్గెట్ చేస్తూ క‌నిపిస్తున్నారు. సినిమాల క‌న్నా కూడా వివాదాల‌తోనే ఆయ‌న హాట్ టాపిక్ అవుతున్నాడు. ప్ర‌స్తుతానికి ఆయన వ్యూహం అనే సినిమా చేస్తున్నాడు దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఎవరెవరు ఎలా ప్రతిస్పందించారు. ఆ తర్వాత ఎలాంటి కుట్రలు జరిగాయి అనే విషయం మీద తన కోణాలను ఆవిష్కరించేందుకు ఈ సినిమా చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. రంగం సినిమాతో తెలుగువారికి పరిచయమైన అజ్మల్ ఈ సినిమాలో వైయస్ జగన్ పాత్రలో నటిస్తున్నాడు.

వ్యూహం సినిమాకి సంబంధించి ప‌లు ఫొటోలు, వీడియోలు ఇప్ప‌టికే విడుద‌ల చేసిన రామ్ గోపాల్ వ‌ర్మ తాజాగా ప‌వ‌న్ పోస్ట‌ర్ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్ చేశారు. కొద్ది రోజుల క్రితం వ్యూహం సినిమా నుంచి నేను విడుదల చేసిన ఫోటో కింద ఫోటో రాత్రి పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకున్న ఫోటో అని ఆయన షేర్ చేశాడు. ప‌వ‌న్ నా పోస్ట‌ర్‌ని కాపీ కొట్టాడు అని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తొమ్మిది ప్రశ్నలు సంధించారు. ఈ తొమ్మిది ప్రశ్నలకు కేవలం ఒక్క పదంలో సమాధానాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ తొమ్మిది ప్రశ్నలూ స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించినవే.

Ram Gopal Varma said pawan kalyan copied his poster
Ram Gopal Varma

ఈ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంతో.. చంద్రబాబుకు మద్దతుగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన విషయం తెలిసిందే. కుట్రపూరితంగానే చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రామ్ గోపాల్ వర్మ ఈ 9 ప్రశ్నలను సంధించారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) ద్వారా స్పందించారు. గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారూ, నా ఈ క్రింది తొమ్మిది ప్రశ్నలకు కేవలం వన్ వర్డ్ ఆన్సర్లు ఇవ్వగలరని నా రిక్వెస్ట్ అంటూ ఆయ‌న ట్వీట్ చేయ‌గా, దీనికి ప‌వ‌న్ స్పందిస్తాడా లేదా అనేది చూడాలి.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago