Payal Rajput : ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ సినిమాలో చాలా కసిగా కనిపిస్తూ కుర్రాళ్లకి కైపెక్కించింది. పాయల్‌ని ఈ చిత్రంలో అలా చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోయారు.అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ హీరోయిన్‌గా రూపొందిన ఆర్ఎక్స్ 100 చిత్రం పెద్ద హిట్ కాగా, ఇప్పుడు చాలా రోజుల తర్వాత పాయల్, అజయ్ కలిసి మంగళవారం అనే సినిమా చేశారు. నవంబర్ 17న చిత్రం రిలీజ్ కానుంది. నవంబర్ 11న మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించగా పాయల్ ఇలా చీరకట్టులో అలరించింది. తన క్యూట్ అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది.
మంగళవారం చిత్రాన్ని స్వాతి గుణుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని ఇస్తున్నాడు. ఇందులో అజయ్ ఘోష్, నందిత శ్వేత, కృష్ణ చైతన్య, దివ్య పిళ్లై తదితరులు నటించారు. చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్టుగా వచ్చిన ఈ ఫంక్షన్ ఎంతో వైభవంగా జరిగింది. దీనికి చాలా మంది అభిమానులు వచ్చి ఈవెంట్‌ను సక్సెస్‌ఫుల్ చేసేశారు. ఇక ఈ ఈవెంట్‌లో కొంచెం తెలుగులో, కొంచెం హిందీలో, కొంచెం ఇంగ్లీష్‌లో ముద్దు ముద్దు మాటలతో మెప్పించింది. స్పీచ్ మొదలెట్టిన సమయంలోనే పాయల్ ‘అందరికీ నమస్కారం.. హలో పుష్పరాజ్.. తగ్గేదేలే సాలా’ అంటూ డైలాగ్ చెప్పింది.
పాయల్ రాజ్‌పుత్ మాట్లాడడానికి ఇబ్బంది పడగా, ఆ సమయంలోనే ‘అర్జున్ సార్.. ప్లీజ్ నన్ను అలా చూడకండి. మిమ్మల్ని చూడగానే నేను బ్లాంక్ అయిపోయాను. ఇప్పుడు ఏం చేయాలి? ఏం మాట్లాడాలో నాకు అస్సలు తెలియడం లేదు. కానీ, నేను ట్రైలర్ లాంచ్ అప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాను. మళ్లీ వాటిని గుర్తు చేసుకుంటున్నాను’ అని పేర్కొంది. ఎవరినీ కోరుకుంటున్నారో : ఇదే వేడుకలో పాయల్ ‘మీరు ఎవరినైతే రావాలని కావాలని గట్టిగా కోరుకుంటున్నారో.. ఆ ప్రకృతే తనను మీ ముందు ఉంచుతుంది. ఈరోజు మీరు (అల్లు అర్జున్) మాతో ఉన్నారు. ఇది నా జీవితంలోనే మర్చిపోలేని రోజు. అంతేకాదు, నా కెరీర్‌లో ఇదే పెద్ద విషయంల. మీరు మా ఫంక్షన్‌కు వచ్చినందుకు చాలా థ్యాంక్స్’ అంటూ అల్లు అర్జున్‌కు వివరించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…