Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా ప్రచారంతో బిజీగా ఉన్నారు.ఈ సారి పిఠాపురం నుండి పోటీ చేస్తున్న పవన్ తప్పనిసరిగా ఈ ఎన్నికలలో గెలవాలని ప్రయత్నిస్తున్నారు. పవన్ ప్రసంగిస్తూ, వైసీపీ అరాచకాలకు ఈ ఎన్నికలతో అడ్డుకట్ట పడుతుందని, జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రతి వైసీపీ గూండాని మోకాళ్లపై నడిపించే పరిస్థితి తీసుకొస్తామని హెచ్చరించారు. ఇళ్ల పట్టాల స్కాంలో రూపాయి విలువ చేయని భూములను కూడా ప్రభుత్వంతో వంద రూపాయలకు కొనిపించారని ఆరోపించారు.
నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల లబ్దిదారులు 5 శాతం మందేనని, కానీ సాక్షి పత్రికలో గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని, సిద్ధం పోస్టర్లు, హోర్డింగులు వేసుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. జగన్ కు మద్దతుగా నిలిచిన వ్యక్తులు నన్ను ఎన్ని మాటలు అన్నారు? దశాబ్దకాలంగా నన్ను తూట్లు పొడిచారు. ఈ మాటలు పడాల్సిన అవసరం నాకేం ఉంది? కాపు రిజర్వేషన్లు ఇవ్వను అని జగన్ చెప్పాడు… సంతోషం. కానీ కాపు సామాజికవర్గం అతడికి ఓటేసింది. కాపు సామాజికవర్గం అంతా ఓటేయకపోతే జగన్ గెలవడు. ఇవాళ కాపు సామాజిక వర్గం కూడా ఆలోచించాలి, బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలు ఆలోచించాలి. జగన్ కు ఎందుకు ఓటెయ్యాలి.
వైసీపీని అందలం ఎక్కిస్తే మన భవిష్యత్‌ను చంపేస్తారని అన్నారు. తనకు గిద్దలూరులో బలం ఉన్నా.. తెలుగుదేశం అభ్యర్థికి మద్ధతు ఇచ్చానని తెలిపారు.ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం త్యాగం చేశానని అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే తెలుగు గంగ, గుండ్లమోటు ప్రాజెక్టులను ఏకం చేస్తామని మాటిచ్చారు. ఇక ఫ్యాన్స్‌పై కూడా పవన్ సీరియస్ అయ్యారు. కండువా విసిరేయడంతో మండిపడ్డారు. అది విప్లవానికి సంకేతం అని అన్నారు. అలానే గుండెలు కొట్టుకుంటే సరిపోదు. ఓటెయ్యాలి. నేను మీ కోసం వచ్చాను. 70 కోట్లు ట్యాక్స్ కట్టాను. ఐదు సంవత్సరాలుగా 200 కోట్లు సంపాదించాను. అవన్నీ వదిలేసుకొని మీ కోసం వచ్చాను. జోష్ భవిష్యత్‌ని నిర్ణయించేలా ఉండాలని పవన్ అన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…