Pawan Kalyan : వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. వారాహి యాత్రంతా కుల, మతాల ప్రస్తావనతోనే సాగిస్తున్న పవన్ కళ్యాణ్ కోనసీమ యాత్రలో మరో షాక్ ఇచ్చారు. ఈసారి ఏకంగా గెలుపోటముల గురించి ప్రస్తావించారు. ముమ్మిడివరం సభలో పవన్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. ఇది 70:30 సర్కారు అన్నారు. వందమంది ప్రజల్లో 70 మంది కష్టపడి సంపాదించిన సొమ్మును వైసీపీ సర్కారు తనకు కావాల్సిన 30 మందికి పంచుతూ ఓటు బ్యాంకును పెంచుకుంటోంది. కేవలం రాజకీయం కోసం మాత్రమే ప్రభుత్వ పథకాలను వాడుకుంటోందన్నారు.
ఇక ఉప్మాస్టోరీ ఒకటి చెప్పిన పవన్ కళ్యాణ్.. ఓ వసతిగృహంలో రోజువారీ ఉప్మా పెడుతుంటే, అంతా ఎదురు తిరిగారని, మాకు ఉప్మా వద్దని నిరసన వ్యక్తం చేశారన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరికి ఏం కావాలో ఓటింగ్ పెట్టారని, 18 మంది యధావిధిగా ఉప్మా కావాలని కోరితే, మిగిలిన 82 మంది వివిధ రకాల టిఫిన్ల పేరు చెప్పారన్నారు. అయితే ఉప్మా కోరుకున్న వారి సంఖ్యే అన్నింటి కంటే ఎక్కువ ఉండటంతో మళ్లీ ఉప్మా దిక్కు అయిందన్నారు. వైసీపీ కూడా ఉప్మా తరహా పార్టీనే అని, వైసీపీ వద్దు అనుకుంటున్న వారిలో ఐక్యత అవసరమని టీడీపీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
విపక్షాల్లోని అనైక్యతే వైసీపీకి బలమని పవన్ కళ్యాణ్ చెప్పారు.. అనైక్యతను వీడి ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తే కచ్చితంగా వైసీపీ ఇంటికి వెళ్లడం ఖాయమని పవన్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసే వైసీపీ ప్రభుత్వానికి ముఖ్యంగా క్రిమినల్ గ్యాంగ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈసారి గెలవడం ఖాయమని, ఒకవేళ ఓడినా బాధపడనంటూ ముక్తాయింపు ఇచ్చారు. ఎన్నికల్లో ఓడినా పట్టించుకోనన్నారు పవన్ కళ్యాణ్. రాజకీయాలు చేయడానికి గుండె ధైర్యముంటే చాలన్నారు. తాను మళ్లీ ఓడిపోతానని నిర్ణయించుకునే ఈ ప్రభుత్వంతో గొడవకు దిగానన్నారు పవన్ కళ్యాణ్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…