Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తుంది. తణుకు పైడిపర్రులోని వారాహి బహిరంగ సభ వేదికగా వైసీపీ నాయకులకి గట్టిగా ఇచ్చి పడేసారు. మీరు మీ మద్దతుదారులు ఇష్టానుసారంగా నన్ను తిడుతున్నారే.. నేను అంటే జగన్ ను జగ్గూభాయ్ అంటే మాత్రం వైసీపీ నేతలకు ఒంటిమీద కారాలు పూసుకున్నట్టుంది. ఏ మేం భరించడం లేదా మీరు కూడా భరించండి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు పవన్ కళ్యాణ్. జగన్ నుంచి జగ్గూ భాయ్ అయ్యారు ఇంకా ఎక్కువ చేస్తే జగ్గు అంటాను ఇంకా మితిమీరితే నేనేమంటానో నాకే తెలియదు.. మీరు నోరు జారితే నేను జారతా అంటా వైసీపీ నేతలపై పవన్ గట్టి కౌంటర్స్ వేశారు.
మీ ఎర్రిపప్ప టాక్స్ వేసి ప్రజలను మోసం చెయ్యకు జగన్ అంటూ వైసీపీ నేతలపై ఇండైరెక్ట్ గా సెటైర్లు గుప్పించారు పవన్ కళ్యాణ్. మొలకలు వచ్చాయన్న రైతులను ఇక్కడ మంత్రి ఎర్రిపప్ప అంటాడు. ఎర్రిపప్ఫ అంటే అర్ధం ఏమిటంటే బుజ్జి కన్నా అంటాడు. జగన్ జే ట్యాక్స్ వేస్తే.. తాడేపల్లిగూడెంలో ‘కే’ ట్యాక్స్.. తణుకులో ఎర్రిపప్ప ట్యాక్స్ వేస్తున్నారు. తాడేపల్లిలో ఒక బూతుల విశ్వవిద్యాలయం ఉంది. వారు చెప్పినట్లు వైసీపీ నాయకులు మాట్లాడితే, చూస్తూ ఊరుకోను’ అని మంత్రిని, ముఖ్యమంత్రిని ఏకవచనంతోనే పవన్ మాట్లాడారు. మీవల్ల 32 మంది భవనకార్మికుల చనిపోయారు. వారి పొట్టకొడుతున్నావ్.. మీ పరిపాలన ప్రజలకు ఆమోదయోగ్యంగా లేదు .చెత్తపాలనలో చెత్తపై కూడా పన్ను వేశావ్ అంటూ జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్.
పోలవరం ప్రాజెక్ట్ ఎలాగో కంప్లీట్ చెయ్యలేవు కానీ ఎర్రకాలువను అయినా సరిచేయొచ్చు కదా అంటూ పవన్ సూచించారు. ఇటీవల కాలంలో పురోషితులను వేలం వేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ విషయంపై ఆయన కోర్టుకు వెళ్తానని చెప్పారు. గతంలోనూ కరప్షన్ ఉంది కానీ జగన్ పాలనలో ఈ అవినీతి తారాస్థాయికి చేరిందని.. ఏ పనిచేసిన మీ మద్దతుదారులకు డబ్బులు కట్టాలా.. నేనెలా బతకాలో చెప్పాడానికి నువ్ ఎవడివి జగన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేనాని. వాలంటీర్లపై నాకు ఎలాంటి ద్వేషం లేదు కొందరు చేసిన తప్పులవల్లే నేను ఆ మాటలు అన్నాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు.