Pawan Kalyan : రెండో దశ వారాహి విజయ యాత్ర చివరి దశలో భాగంగా తణుకులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తణుకు సభ సాక్షిగా ‘చింతిస్తున్నా.. క్షమించండి’ అని కార్యకర్తలు, అభిమానులు, నేతల ముందే పవన్ కళ్యాణ్ అన్నారు. వలంటీర్ వ్యవస్థపై వివాదం చెలరేగుతున్న సమయంలో పవన్ ఇలా క్షమాపణలు చెప్పాడా అనుకుంటే పొరపాటే. తన ప్రసంగం మొదలు పెట్టకు ముందు…తణుకు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నేత విడివాడ రామచంద్రరావుకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పారు.“మీలాంటి నిలబడే బలమైన నాయకుల వెంట గత ఎన్నికల సమయంలో నేను నిలబడలేనందుకు చింతిస్తున్నాను.నిన్న కార్యకర్తల సభలో క్షమాపణలు చెప్పిన నాకు సరిపోలేదు.
ఈ సందర్భంగా తణుకులో పబ్లిక్ గా మీకు క్షమాపణలు చెబుతున్న.సిద్ధాంతాన్ని నమ్మి నేను రాజకీయాలు చేస్తున్నాను. ఓటమి.గెలుపు అనేది పక్కన పెడితే ఎక్కువగా ప్రయాణమే ఉంటుంది. సీటు ఇవ్వకపోయినా ఇంకొకరికి ఆ స్థానం కేటాయించగా… సీటు కేటాయించిన వ్యక్తి పార్టీ వీడి వెళ్ళిపోయాడు.అయితే సీటు కేటాయించక పోయిన కూడా విడివాడ రామచందర్రావు పార్టీ కోసం నిలబడినందుకు ధన్యవాదాలు ..అందరి ముందు క్షమాపణలు కోరుతున్నానని పవన్ వ్యాఖ్యానించారు”.ఇదే సమయంలో తణుకులో భారీ స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.
అమృతం కురిసిన రాత్రి రచించిన కవి దేవరకొండ బాల గంగాధర తిలక్ జన్మించిన ఈ ప్రాంతంలో అదే రీతిలో అభిమానం కూడా అమృతంలాగా తాను అనుభవించినట్లు పవన్ స్పీచ్ ఆరంభించారు. వైసీపీ కొంపలంటిస్తుందని.. జనసేన గుండెలంటిస్తుందంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన పోరాటం పొలిటికల్ కరప్షన్, వైసీపీ దురాక్రమణ పాలన మీదని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ కు సగటు మనిషి కష్టాలేంటో తెలుసా.. పప్పులు ఉప్పుల రేట్లు అన్నీ పెంచేశావ్.. రైతులకు అండగా ఉంటానని చెప్పి వారికి కనీస మద్ధతు ధరను కూడా ఇవ్వడం లేదంటూ ఆయన జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు జనసేనాని.