Pawan Kalyan : ఏంట‌మ్మా.. వాలంటీర్స్.. మీకు సారీ చెప్పాలా.. త‌గ్గేదే లే అంటున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

Pawan Kalyan : జన‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్..ఏలూరు స‌భ‌లో వాలంటీర్స్‌పై సంచ‌ల‌న వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే. వాలంటీర్‌ వ్యవస్థ ప్రారంభించినప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం వేరే కావచ్చని ఇప్పుడు మాత్రం ప్రజల సున్నితమైన సమాచారం ఎటు వెళ్తుందో ఎవరికి తెలుసని ప్రశ్నించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఏలూరు స‌భ‌లో ప‌వన్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌ల ప‌ట్ల ఆయ‌న సారీ చెప్పాలంటూ వాలంటీర్స్ రోడెక్కారు. అయిన కూడా ప‌వ‌న్ త‌గ్గేదే లే అంటూ వాలంటీర్స్ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. ఏలూరులో జనసేన నాయకులు, వీర మహిళలతో సమావేశంలో పవన్‌ కళ్యాణ్ మాట్లాడుతూ.. కేవలం రూ. 5 వేలకే యువతను ఊడిగం చేయమంటున్నారని విమర్శించారు

ఢిల్లీలో కూర్చున్న పెద్దలు, నిఘా సంస్ధల వ్యక్తులు ఏపీలో ఇన్ని వేల మంది అమ్మాయిలు మిస్సవుతున్నారని ఓ పార్టీ అధినేత తనను అడిగారని పవన్ తెలిపారు. ప్రభుత్వంలో పనిచేసే కొంత మంది కుమ్మక్కయ్యారని తనకు చెప్పారన్నారు అపార్ట్ మెంట్లో టూలెట్ బోర్డు పెడితే ఇద్దరు, ముగ్గురు కుర్రాళ్లకు ఊరికే అద్దెకివ్వరని, ఎన్నో విషయాలు ఆలోచిస్తారని పవన్ తెలిపారు. వాలంటీర్లలో మహిళల గురించి తాను మాట్లాడటం లేదని, బ్యాచ్ లర్లకు డేటా సేకరణ బాధ్యత ఇచ్చారని, వారి దగ్గర కుటుంబాల డేటా చాలా ఉంటోందని పవన్ తెలిపారు. జగన్ వాలంటీర్ల వ్యవస్ధ మొదలుపెట్టినప్పుడు వారి ఉద్దేశం వేరై ఉండొచ్చని, కానీ సమాచారం అనేది చాలా సున్నితమన్నారు.

Pawan Kalyan serious comments on volunteers again
Pawan Kalyan

గ్రామాల్లో తల్లితండ్రులు ఇళ్లలో లేనప్పుడు మహిళల సున్నితమైన డేటా తీసుకుంటున్నారని ఆరోపించారు. పంచాయతీరాజ్, రెవెన్యూ వ్యవస్ధలుండగా వాలంటీర్ల పేరుతో మరో సమాంతర వ్యవస్ధ ఎందుకన్నారు. . ప్రజల విలువైన సమాచారాన్ని వారు ఎందుకు సేకరిస్తున్నారని నిలదీశారు. వాలంటీర్లు ఎవరో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. వారి సమాచారం కలెక్టర్లు, ఎస్పీల వద్ద ఉండాలని పేర్కొన్నారు. వారిపై ఫిర్యాదుకు టోల్‌ ఫ్రీ నంబర్‌ ఉండాలని.. వాలంటీర్‌ వ్యవస్థ పట్ల కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.ఈ వ్యవస్థను ఇప్పుడే అదుపులో పెట్టాలని.. వాలంటీర్ల వ్యవస్థ ప్రమాదకరంగా మారుతోందని పవన్‌ కళ్యాణ్ మ‌రోమారు హెచ్చరించారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago