Pawan Kalyan : మీరు ఎన్ని తిట్టిన‌, ఏం చేసిన నా వెంట్రుక కూడా పీక‌లేరు అంటూ ప‌వన్ ఫైర్

Pawan Kalyan : ఏలూరు స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తున్నాయి. ఏపీలోని ఒంటరి మహిళలు, వితంతువుల వివరాలు సేకరించి సంఘవిద్రోహశక్తులకు వాలంటీర్లు ఇస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకి రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహాలు వెల్లువెత్తుతుండ‌డం మనం చూస్తున్నాం. కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక పవన్ వ్యాఖ్యలపై ఇప్పటికే మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ క్షమాపణలు చెప్పకపోతే మహిళా కమిషన్ ఆయనను వెంటాడుతూనే ఉంటుందని హెచ్చరించారు.

అయితే ఎవ‌రెంత ర‌చ్చ చేసిన కూడా ప‌వ‌న్ మాత్రం త‌గ్గేదే లే అన్న‌ట్టుగా ఉన్నారు. ఏలూరులో జ‌న‌సైనికులు, వీర‌మ‌హిళ‌ల‌తో జ‌రిగిన స‌మావేశంలో మాట్లాడిన ప‌వన్ క‌ళ్యాణ్‌.. వాలంటీర్లలో మహిళల గురించి తాను మాట్లాడటం లేదని, బ్యాచ్ లర్లకు డేటా సేకరణ బాధ్యత ఇచ్చారని, వారి దగ్గర కుటుంబాల డేటా చాలా ఉంటోందని పవన్ తెలిపారు. గ్రామాల్లో తల్లితండ్రులు ఇళ్లలో లేనప్పుడు మహిళల సున్నితమైన డేటా తీసుకుంటున్నారని ఆరోపించారు. పంచాయతీరాజ్, రెవెన్యూ వ్యవస్ధలుండగా వాలంటీర్ల పేరుతో మరో సమాంతర వ్యవస్ధ ఎందుకని ప్ర‌శ్నించారు ప‌వ‌న్.

Pawan Kalyan sensational comments on cm ys jagan
Pawan Kalyan

ఐదు వేల రూపాయలు తీసుకునే వాలంటీర్లలో కొంతమంది తప్పుచేస్తే తాము ఎవరికి చెప్పుకోవాలని పవన్ ప్రశ్నించారు. వాలంటీర్ల డేటా తీసుకునే హక్కు అందరికీ ఉండాలన్నారు. ప్రతీ ఎస్పీ, కలెక్టర్ కార్యాలయాల్లో వాలంటీర్ల డేటా పెట్టాలని పవన్ డిమాండ్ చేశారు. ముసలి తల్లితండ్రుల్ని మీ పిల్లలు విదేశాల్లో ఉంటున్నారు కదా అంటూ కొందరు వాలంటీర్లు బెదిరిస్తున్నారని పవన్ చెప్పుకొచ్చారు. వాలంటీర్ వ్యవస్ధను జాగ్రత్తగా చూడాలన్నారు. వాలంటీర్లకు తాము వ్యతిరేకం కాదని, వాళ్ల పని చేస్తే ఇబ్బంది లేదని, ప్రభుత్వానికి మాత్రమే పనిచేస్తామంటే కుదరదని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు. ప‌వ‌న్‌కి వ్య‌తిరేఖంగా పెద్ద ఎత్తున ధ‌ర్మాలు చేస్తున్న స‌మ‌యంలో కూడా ప‌వ‌న్ వాలంటీర్స్ గురించి నెగెటివ్ వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago