Pawan Kalyan Satyagrahi : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలపై అభిమానులలో ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని ఫ్లాపులు వచ్చినా కూడా పవన్ తర్వాతి సినిమా కోసం ఎంతో ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో చాలా సినిమాలని మధ్యలోనే ఆపేశారు. వాటిలో సత్యాగ్రహి ఒకటి. 2003లో పవన్ దర్శకత్వంలో, ‘ఖుషి’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన శ్రీసూర్య మూవీస్ బ్యానర్ మీద అగ్రనిర్మాత ఏ.ఎమ్. రత్నం ‘సత్యాగ్రహి’ సినిమాను అనౌన్స్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో భారీగా ఓపెనింగ్ కూడా చేశారు.
దర్శకరత్న దాసరి క్లాప్, విక్టరీ వెంకటేష్ కెమెరా స్విఛ్చాన్, డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. అనివార్య కారణాలతో సినిమాను పక్కన పెట్టేశారు. అసలు ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. నిర్మాతతో క్రియేటివ్ డిఫరెన్సెలు వచ్చాయని, స్క్రిప్టు సరిగ్గా రాలేదని, బడ్జెట్ ఎక్కువైందని ఇలా అనేక రకాలుగా ప్రచారాలు అయితే సాగాయి. తాజాగా ఈ విషయమై నిర్మాత ఎఎమ్ రత్నం మాట్లాడారు. “జాని చిత్రం రిజల్ట్ చూసాక, పవన్ చాలా నిరాశపడ్డారు.
![Pawan Kalyan Satyagrahi : పవన్ కళ్యాణ్ సత్యాగ్రహి ఎందుకు ఆగిందో ఇప్పటికి తెలిసింది...! Pawan Kalyan Satyagrahi movie finally the reason revealed](http://3.0.182.119/wp-content/uploads/2022/12/pawan-kalyan-satyagrahi.jpg)
ఆయన డైరక్షన్ స్కిల్స్ తెలుగు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేదని , అందుకే సత్యాగ్రహి చిత్రంపై మా డబ్బుని రిస్క్ చేయటానికి ఇష్టపడలేదు. దాంతో ఆ సినిమా ప్రాజెక్టుని ఆయనే ఆపేసారు అని ఏఎం రత్నం అన్నారు. ఇక దాదాపు 18 ఏళ్ల తర్వాత పవన్ ‘సత్యాగ్రహి’ గురించి గుర్తు చేసుకున్నారు. లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్ కాలంలో జరిగిన ఎమర్జెన్సీ ఉద్యమం నుండి స్పూర్తి పొంది పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో చేద్దామనుకున్న సినిమా.. సినిమాలో నటించడం కంటే కూడా ఇంకా టాక్ నడుస్తుండడం మరింత సంతృప్తినిస్తుంది అంటూ పవన్ ఆ మధ్య ట్వీట్ చేశారు.