Nagababu : మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నటుడిగా, జడ్జిగా, నిర్మాతగా ఆయన తన సినీ ప్రస్థానంలో అంచెలంచలుగా ఎదుగుతూ వచ్చారు. ఇప్పుడు జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే చిరంజీవిని కాని ,పవన్ కళ్యాణ్‌ని కాని ఎవరైన ఏమన్నా అంటే వెంటనే స్పందిస్తుంటారు నాగబాబు. తాజాగా ఆయన చేసిన కామెంట్ చర్చనీయాంశంగా మారింది . చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్‌తో చిత్ర దర్శకుడు కె.బాబీ, మెగా బ్రదరన్ కె.నాగబాబు సమావేశం అయ్యారు.
ఈ క్రమంలో నాగబాబు మాట్లాడుతూ.. ‘మెగా ఫ్యాన్స్ గమనించాల్సిన విషయమేమంటే అభిమానులందరూ చాలా పవర్‌ఫుల్ ఆర్గనైజేషన్. చిరంజీవిగారి మీద కానీ.. ఆయన కుటుంబం మీద కానీ ఈగ వాలినా ఎంతకైనా వెళ్లగలిగే వ్యక్తులు మన అభిమానులు అని అన్నారు నాగబాబు. చిరంజీవిగారు ఎలాంటి కాంట్రవర్సీలకు వెళ్లరు. వినయ విధేయలతో ఉంటారు. అలా ఉన్నారు కదా అని ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది ఫ్యాన్స్ అని చెప్పుకొచ్చారు.. ఆయన అభిమానిగా నేనైతే ఊరుకోను. నేను ఇంకా ఫ్యాన్స్‌ని రెచ్చగొట్టే పనులు ఎప్పటికీ చేయను.
నేను ఒక్క మాట అటు ఇటు మాట్లాడితే శాంతి భద్రతలకు విఘాతం కలిగే చర్యలు జరుగుతాయని సైలెంట్‌గా ఉంటాను అని నాగబాబు అన్నారు. చిరంజీవి తర్వాత సినిమాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్‌ను, అల్లు అర్జున్‌ను, రామ్‌చరణ్‌ను కూడా అభిమానులు ఆదరించారని గుర్తుచేసుకున్నారు. తమ ఫ్యామిలీలో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. అందరం కలిసే ఉన్నామని అని చెప్పిన ఆయన, దాదాపు పదేళ్ల తర్వాత చిరంజీవి తిరిగి సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా అభిమానులు అదే రకమైన ప్రేమను చూపెట్టారని అన్నారు. చిరంజీవి మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే నమ్మకం అయితే తనకు లేదని చెప్పారు.