Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆయన పేరు ఓ ప్రభంజనం. సినిమా నటుడిగా కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా పవన్ కల్యాణ్‌ని చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇప్పటి వరకు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా ఆపదలో ఉన్న వారికి తన వంతు సాయం చేశాడు. జనసేన అనే పార్టీని స్థాపించి నలుగురికి న్యాయం చేయాలని తపనపడుతున్నాడు. అయితే పార్టీని నడిపించటానికి డబ్బులు అవసరం కాబట్టి తాను సినిమాలు చేస్తున్నట్లు ఆయన ఇది వరకే ప్రకటించారు. ప్రస్తుతం సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలోను తనదైన ముద్ర వేసుకుంటున్నారు.
తాజాగా పవన్ కల్యాణ్‌కి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో ఓ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఆర్థిక పరిస్థితి గురించి వ్యాఖ్యలు చేయటం కొస మెరుపు. పవన్ కళ్యాణ్ తాను సంపాదించిన డబ్బును ప్రజలకు దానం చేసి.. తన సంపాదనకు సంబంధించిన దానిపై ట్యాక్స్ కట్టడానికి రూ.5 కోట్లు అప్పు చేయటాన్ని తాను కళ్లారా చూశానని జనసేన నాయకుడు చెప్పటంతో అందరు ఆశ్చర్యపోయారు. పవన్ సినిమాలు చేసి కోట్లు సంపాదించొచ్చు కాని ఆయన ప్రజా సేవ కోసం ఉన్న ఆస్తులు కూడా అమ్ముకుంటున్నాడని కొందరు చెప్పుకుంటూ బాధపడుతున్నారు.

ఇటీవల పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు ఆర్థిక సాయాన్ని అందజేసిన విషయం తెలిసిందే. తాము పవన్ కళ్యాణ్ సభకు స్థలం ఇవ్వటం వ్లల ఇప్పటం గ్రామంలో కూల్చివేతలు జరిగాయని అక్కడి స్థానికులు చెప్పడంతో, నష్టపోయిన కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఇలా ఎన్నో సార్లు ఆపదలో ఉన్న వారికి తన వంతు సాయం చేసి మంచి మనసు చాటుకున్నారు పవన్. ఇక పవన్ కళ్యాణ్ పూర్తి రాజకీయాల్లో రాకపోవటానికి ఆర్థిక సమస్యలంటూ వస్తున్న వార్తలకు బలాన్ని చేకూర్చేలా ఆయన రీసెంట్‌గా మరో రెండు సినిమాల్లో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మనందరికి తెలిసిందే.
https://twitter.com/Hidderkaran/status/1601129057239781376