Chamika Karunaratne : ఏ ఆటలో అయిన ఆటగాళ్లకి గాయాలు కావడం సహజం. క్రికెట్ వంటి గేమ్‌లో అయితే ఎప్పుడు ఎవరో ఒకరు గాయపడుతూనే ఉంటారు. కొన్ని సార్లు బాల్ బలంగా తాకడం వలన చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.గ్రౌండ్ లో ఆడుతూ క్రికెటర్లు గాయపడిన ఘటనలు ఇప్పటివరకు చాలా జరిగాయి. తాజాగా ఓ క్రికెట్ మ్యాచ్ లో ఊహించని ఘటన జరిగింది. క్యాచ్ పడుతుండగా ప్రమాదం జరగగా, ఈ ప్రమాదంలో ఓ క్రికెటర్ మూతి పళ్లు రాలిపోయాయి. గాలే గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్ లో భాగంగా కార్లెస్ బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో ఫెర్నాండో భారీ షాట్‌కు ప్రయత్నించగా, అప్పుడు బంతి గాల్లోకి లేచింది.
క్యాచ్‌ను అందుకునేందుకు పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కరుణరత్నేవెనుకకు పరుగెత్తాడు. బంతి గమనాన్ని అంచనా వేయలేకపోయి కరుణరత్నే మూతికి బంతి బలంగా తాకడంతో పళ్లు ఊడిపోయాయి. తీవ్రంగా రక్తం కారింది. దెబ్బతగిలినా మాత్రం…కరుణ రత్నే మాత్రం క్యాచ్ వదల్లేదు. బాల్ ను అందుకున్న తర్వాత నొప్పితో డగౌట్ కు వెళ్లిపోగా, ఆ తర్వాత కరుణ రత్నేను ఆసుపత్రిలో చేరాడు. బంతి తగలడం వల్ల కరుణరత్నేకు నాలుగు పళ్లు ఊడిపోయాయని.. సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి కరుణ రత్నే క్యాచ్ వీడియో వైరల్‌గా మారింది.

టీ20 వరల్డ్ కప్ 2022 ఆడిన చమీక కరుణరత్నేపై శ్రీలంక క్రికెట్ అసోసియేషన్ ఏడాది పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. బోర్డు నిబంధనలను ఉల్లంఘించినందుకు అతను ఏ ఫార్మాట్ ఆడకుండా లంక బోర్డు నిషేదం విధించడంతో పాటు 5 వేల డాలర్ల ఫైన్ విధించింది. అయితే టీ20 ప్రపంచకప్ 2022 కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన కరుణరత్నే.. బ్రిస్బేన్‌లోని ఓ క్యాసినోలో తాగి…స్థానికులతో గొడవపడ్డట్టు ఆరోపణలు రావడంతో నిషేదం విధించారు. అప్పుడు ఇంగ్లండ్ పర్యటనలోనూ బయోబబుల్ బ్రేక్ చేసి సిగరేట్లు తాగడం పెద్ద వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.
Chamika Karunaratne lost 4 teeth while taking a catchpic.twitter.com/WFphzmfzA1
— Out Of Context Cricket (@GemsOfCricket) December 8, 2022