Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన రెండు పడవల ప్రయాణం చేస్తుండగా సినిమాల్లో ఇప్పటికే ఊహించని స్థాయిలో సక్సెస్ అయిన పవన్ రాజకీయాల్లో కూడా ఏదో ఒకరోజు సక్సెస్ అవుతానని భావిస్తున్నారు.జనసేన పార్టీ ద్వారా ఏపీలో కింగ్ మేకర్ అవుతున్న పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో కచ్చితంగా సీఎం అవుతారని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా పవన్ కి సంబంధించిన విషయం నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.
అయితే పవన్ కళ్యాణ్ చేతికి ప్రస్తుతం తాబేలు ఉంగరం కనిపిస్తోంది. ఈ ఉంగరాన్ని చూసిన నెటిజన్లు, పవన్ అభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఉంగరం ధరించడానికి కారణం ఏంటని చర్చించుకుంటున్నారు. అయితే తాబేలు ఉంగరం ధరించడం వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయని తెలుస్తోంది.ఎవరైతే ఈ ఉంగరాన్ని ధరిస్తారో వాళ్లు ఆర్థికంగా, పొలిటికల్ గా మంచి ఫలితాలు పొందుతారని అనుకుంటున్నారు. పవన్ చేతికి ఉన్న ఉంగరం ఎంతో మహిమ ఉన్నదని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కి అభిమానుల సంఖ్య భారీగా ఉన్న విషయం తెలిసిందే. జ్యోతిష్య శాస్త్రంలో తాబేలు ఉంగరం పెట్టుకుంటే పాజిటివ్ శక్తి వస్తుందట. ఆత్మవిశ్వాసం పెరుగుతుందట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని రాశుల వారు ఈ ఉంగారాన్ని ధరించటానికి లేదు. కొన్ని రాశుల వారే ధరించాలి. మహా విష్ణువు అవతారాల్లో ఒకటి తాబేలు.. అందుకే ఇది చాలా పవర్ ఫుల్ అంటారు.
![Pawan Kalyan : తాబేలు ఉంగరం పెట్టుకున్న పవన్.. దాంతో ఏమవుతుంది..? Pawan Kalyan put tortoise ring what happens with it](http://3.0.182.119/wp-content/uploads/2023/04/tortoise-ring.jpg)
పవన్ అభిమానులు సైతం పవన్ స్టైల్ ను ఫాలో అవుతారు.ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తాజాగా పవన్ కళ్యాణ్ లుక్ లీక్ కాగా ఈ లుక్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పవన్ వరుసగా సినిమాల్లో నటిస్తుండటంతో అభిమానులు సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు.పవన్ బాక్సాఫీస్ ను మరోసారి షేక్ చేస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.