Allu Arjun And Ram Charan : మెగా అభిమానుల మధ్య తరచుగా అంతర యుద్ధాలు జరుగుతూనే ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. వాస్తవానికి మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ అభిమానులు ఒకరికొకరు దూషిస్తూ సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తూనే ఉన్నారు. ఇకపోతే వాస్తవానికి పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ అభిమానులకు అస్సలు పడదు. అలాగే రామ్ చరణ్, అల్లు అర్జున్ ) అభిమానులకు కూడా పడదు. మరొకవైపు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అభిమానులకు ఏమాత్రం పొసగదు అనే విషయం తెలిసిందే.. వాగ్వాదానికి దిగితే ఇతర హీరోల ఫ్యాన్స్ వద్ద పరువు పోతుందని కూడా ఆలోచించరు.
ఇక ఇప్పుడు హీరో రామ్ చరణ్ అల్లు అర్జున్ కి చెడిందా అంటే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.అందుకు గల కారణాలు కూడా లేకపోలేదు. గత నెల అనగా మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్పాలి. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిన తర్వాత వస్తున్న మొదటి బర్త్డే కావడంతో చెర్రీ ఫాన్స్ బర్త్ డే ని ధూమ్ ధామ్ గా చేశారు. రామ్ చరణ్ కి అన్ని ఇండస్ట్రీల నుండి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
![Allu Arjun And Ram Charan : అల్లు అర్జున్, రామ్ చరణ్ మధ్య విభేదాలా.. బీజం పడింది ఇక్కడేనా..? Allu Arjun And Ram Charan have differences what is the truth](http://3.0.182.119/wp-content/uploads/2023/04/allu-arjun-ram-charan.jpg)
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ కనీసం విష్ కూడా చేయలేదు.అంతేకాకుండా కొడుకు పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ ఇంట్లో అదేరోజు గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేయగా ఆ ఫంక్షన్ కి కూడా అల్లు అర్జున్ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే చెర్రీ బన్నీకి మధ్య సఖ్యత లేదని ఇద్దరికీ చెడింది అంటూ అనేక వార్తలు ఊపందుకున్నాయి. వాస్తవానికి రామ్ చరణ్ ప్రస్తుతం తన భార్యతో మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నా కూడా ఆయన బన్నీని గుర్తు పెట్టుకొని విష్ చేశాడు. కానీ ఇక్కడే అభిమానుల మధ్య గొడవ మొదలైంది. ముష్టి వేసాం తీసుకోండని రామ్ చరణ్ అభిమానులు కామెంట్ చేయగా.. పోస్ట్ చేయడానికి ఒక్క ఫోటో కూడా దొరకలేదా చెడ్డి అని బన్నీ ఫాన్స్ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికైతే మళ్లీ అభిమానుల మధ్య వార్ మొదలైందని చెప్పాలి. మరోవైపు హ్యాపీ బర్త్ డే మై డియరెస్ట్ అఖిల్ అఖిల్ తో దిగిన ఫోటో పోస్ట్ చేశాడు దీంతో వార్ మొదలైంది. ఇది ఎంత వరకు వెళుతుందో చూడాలి.