Laya : ఒకప్పుడు సూపర్ హిట్ చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకి ఎంతో చేరువైన లయ పెళ్లి తర్వాత అమెరికాలో ఉంటుంది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకి మంచి వినోదం పంచుతుంది. రీసెంట్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది లయ . అమెరికాలో సెటిల్ అయిన డాక్టర్ గణేష్‌ను లయ 2006లో పెళ్లి చేసుకోగా, వారి పెళ్లికి ఆహ్వానించటానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారట ఆమె. చిరంజీవి అంతకు ముందు లయ పార్టిసిపేట్ చేసిన కొన్ని ప్రోగ్రామ్స్‌కి అతిథిగా వెళ్లటం వల్ల ఆయనతో మంచి పరిచయం ఉంది. కాబట్టి పిలిస్తే వచ్చే అవకాశం ఉంది. కానీ పవన్ కళ్యాణ్‌కి నేనెవరో పెద్దగా తెలియక పోవచ్చు కదా, మరి పిలిస్తే ఆయన వస్తారా! అని ఆలోచనతోనే వెళ్లింది లయ.
పవన్ కళ్యాణ్ అపాయింట్‌మెంట్ తీసుకోకుండానే ఆయనని కలిసేందుకు వెళ్లాను. అప్పుడు ఆయన రిసీవ్ చేసుకున్న విధానం చూసి ఆశ్చర్యపోయా. పెళ్లికి మాత్రం వారి ఫ్యామిలీ నుంచి చిరంజీవి గారు వస్తారని అనుకున్నా. పవన్ వస్తారో లేదో అనే అనుమానం ఉండేది. ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు తప్పకుండా వస్తానని అయితే మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ అందరికంటే ముందే వచ్చి సర్ప్రైజ్ చేశారు. కనీసం అతిథి మర్యాదలు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. అన్నయ్య చిరంజీవి గారు కూడా వస్తున్నారు ఆన్ ది వే లో ఉన్నారమ్మా’ అని చెప్పడం నా లైఫ్ లో మరచిపోలేని మధురమైన అని లయ గుర్తు చేసుకున్నారు.
థాంక్యూ సో మచ్ సార్.. భోజనం చేసి వెళ్ళండి’ అని లయ పవన్‌తో అంటే.. ఆయన నవ్వి భోజనం చేయాలమ్మ, తర్వాత చూద్దాం అంటూ నవ్వుకుని వెళ్లిపోయారని లయ చెప్పుకొచ్చారు. లయ చివరగా రవితేజ అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో గెస్ట్ రోల్ లో మెరిశారు. త్వరలో ఆమె టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. తన భర్త డాక్టర్ వృత్తిలో బిజీగా ఉండగా.. తాను డ్యాన్స్ స్కూల్ నడుపుతున్నాను అని లయ చెప్పుకొచ్చింది. లయ సోషల్ మీడియాలో షేర్ చేసే వీడియోలకి మంచి రెస్పాన్స్ వస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…