Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు వరుస ఫ్లాపులు వచ్చిన కూడా క్రేజ్ తగ్గదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు సినిమాలు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుండగా దీని కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే పవన్‌తో సినిమాలు చేయాలని నిర్మాతలు భావిస్తున్నప్పటికీ సమయం ఎక్కువగా లేకపోవడం వలన అది కుదరడం లేదు.
మిగతా హీరోల కన్నా పవన్‌తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు తెగ ఆసక్తి చూపుతుంటారు. అందుకు కారణం పవన్ సినిమా ఫ్లాప్ అయినా కూడా సేఫ్ జోన్‌లో ఉంటామని వారి అభిప్రాయం. పవన్ నటించిన చాలా సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ మంచి వసూళ్లే రాబట్టాయి. వాటిలో డాలీ దర్శకత్వంలో రూపొందిన గోపాల గోపాల సినిమా ఒకటి. ఈ సినిమా ఆశించిన మేర విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇక కాటమరాయుడు సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ రూ.89 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.
![Pawan Kalyan : మిగతా హీరోల హిట్ సినిమాలు.. పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమాలతో సమానమా.. ప్రూఫ్ ఇదే..! Pawan Kalyan flop movies and other heroes hit movies are same](http://3.0.182.119/wp-content/uploads/2022/09/pawan-kalyan.jpg)
గబ్బర్ సింగ్ హిట్ కావడంతో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను తెరకెక్కించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.92 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం తొలి రోజే రూ.50 కోట్ల గ్రాస్ వసూలు అయింది. ఇక పవన్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా దారుణమైన ఫ్లాప్ అయినప్పటికీ ఈ సినిమా రూ.95 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇలా పవన్ కళ్యాణ్ సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ కలెక్షన్స్ విషయంలో మాత్రం తిరుగులేదనిపించాయి.