Jabardasth Judges : బుల్లితెర ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచుతున్న కామెడీ షో జబర్ధస్త్. ఈ కార్యక్రమం వినోదాన్ని పంచడంతోపాటు వివాదాలలో కూడా నిలుస్తుంది. ఇటీవల ఈ కామెడీ షో నుంచి కొంత మంది కమెడియన్స్ కూడా బయటకు వెళ్లిపోతూ అనేక రకాల ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇలా జబర్ధస్త్ హాట్ టాపిక్‌గా మారుతుంది. అయితే తాజాగా జబర్ధస్త్ షోకి జడ్జిగా వ్యవహరించిన వారికి సంబంధించి రెమ్యునరేషన్ వివరాలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రోజా జబర్ధస్త్ జడ్జ్‌గా ఒక్కో ఎపిసోడ్ కోసం రూ.5లక్షలు రెమ్యూనరేషన్ తీసుకునేది అని సమాచారం. ఇక చిరంజీవి సోదరుడు నాగబాబు ప్రతి ఎపిసోడ్‌కి రూ.3లక్షలు మాత్రమే తీసుకున్నారట. ఇక ఇప్పటి జడ్జి ఇంద్రజ ఒక్కో ఎపిసోడ్ కు రూ.2.50లక్షలు పారితోషకంగా తీసుకుంటుందని సమాచారం. ఇక జబర్దస్త్ కి కొత్త జడ్జిగా వచ్చిన భగవాన్ కి ప్రస్తుతం ఎపిసోడ్ కు రూ. 2.50 లక్షల పారితోషకం ఇస్తున్నట్లు సమాచారం.
![Jabardasth Judges : జబర్ధస్త్ జడ్జిల రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..! Jabardasth Judges remuneration details will surprise you](http://3.0.182.119/wp-content/uploads/2022/09/jabardasth-judges.jpg)
ఇదిలా ఉంటే జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వారు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు గట్టిగానే అందుకుంటున్నారు అని చెప్పవచ్చు. మొదట సినిమాలో నటించిన వారు కూడా ఆ తర్వాత జబర్దస్త్ లోకి వస్తున్నారు. ఒక విధంగా సినిమాల కంటే జబర్దస్త్ ద్వారానే లాభపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. 2013లో మొదలైన జబర్దస్త్ ఆ తర్వాత కంటిన్యూగా కొన్నేళ్ల వరకు కూడా టాప్ రేటింగ్ అందుకుంటూ మంచి ఆదాయాన్ని సొంతం చేసుకుంది. అయితే అందులో నుంచి కొన్నాళ్ళకు కొంతమంది సీనియర్ కమెడియన్స్ వివిధ కారణాల వలన బయటకు వెళ్లిపోయారు.