Pavitra Lokesh : హీరోయిన్ గా సక్సెస్ అయ్యాక పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి కొన్నాళ్ల గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ తో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న నదియా లాంటి వాళ్ళే కాకుండా హీరోయిన్ గా సక్సెస్ రాక, ఛాన్స్ లు రాక, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి మళ్ళీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ లో దుమ్మురేపుతున్న వాళ్ళూ ఉన్నారు. ఈ రెండో కోవలోకి ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ వస్తుంది. తెలుగులో అనేక చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటించిన ఈమె హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించినప్పటికీ ఆ చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
దాంతో పవిత్ర లోకేష్ కొంతకాలం పాటు సినిమా ఛాన్స్ లు లేక ఉద్యోగం కూడా చేసింది. ఆ తర్వాత మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ తదితర భాషల్లో నటిస్తూ బాగానే రాణిస్తోంది. అంతకుముందు చాలా సినిమాల్లో నటించిన పవిత్ర రామ్ రెడ్ మూవీలో మాత్రం సిగరెట్ కాల్చుతూ మద్యం సేవించే అలవాటు ఉన్న మహిళ పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఇక ఈ రోల్ గురించి సోషల్ మీడియాలో అప్పట్లో తెగ వైరలవ్వడంతో ఆమె స్పందిస్తూ తాను కేవలం పాత్ర పరంగా అలా నటించానే తప్ప తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని క్లారిటీ ఇచ్చింది. పవిత్ర లోకేష్ స్వతహాగా కన్నడ సినీ పరిశ్రమకు చెందిన నటి అయినా తెలుగులోనే ఎక్కువ గుర్తింపు వచ్చింది.
తెలుగులో సీనియర్ నుంచి జూనియర్ వరకు దాదాపు అందరు హీరోల చిత్రాల్లోనూ అమ్మ పాత్రలలో నటించి మెప్పించింది. ఇక ఈమె రెమ్యునరేషన్ గురించి కూడా పలు వార్తలు ఈ మధ్య సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు చిత్రాలలో నటించేందుకు రోజుకి దాదాపు 50 వేల రూపాయల నుంచి లక్ష వరకూ తీసుకుంటుందని టాక్. అయితే నరేష్‌తో రిలేషన్‌షిప్ గురించిన విషయం బయటకు వచ్చాక ఆమె తన రెమ్యునరేషన్‌ను రెట్టింపు చేసినట్లు తెలుస్తోంది. అంటే రోజుకు దాదాపుగా రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రోజుకు ఈమె రెమ్యునరేషన్ తీసుకుంటుందన్నమాట. ఇక అవుట్ డోర్ షూటింగ్ అయితే ప్రత్యేక విమానం టికెట్లు, హోటల్ గదుల చార్జీలు కూడా నిర్మాతలే భరించాలట. ఇలా పవిత్ర లోకేష్ ఈ మధ్య కాలంలో అయితే చాలా పాపులర్ అయింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…