Ghee : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే నెయ్యిని ఉపయోగిస్తున్నారు. నెయ్యికి ఆయుర్వేదంలోనూ ఎంతో విశిష్ట స్థానం ఉంది. నెయ్యి ఔషధంగా పనిచేస్తుంది. అనేక వ్యాధులను తగ్గిస్తుంది. దీంతో పలు ఔషధాలను కూడా తయారు చేస్తారు. పూర్వకాలంలో మన పెద్దలు తమ ఆహారంలో నెయ్యిని ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ నెయ్యి వాడకం ప్రస్తుతం తగ్గింది. దీంతో అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. అయితే నెయ్యిని రోజూ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా నెయ్యిని రోజూ అన్నంలో మొదటి ముద్దలో తినాలి. దీంతో అనేక లాభాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నెయ్యిని అన్నంలో మొదటి ముద్దలో తినడం వల్ల మనకు రోజు కావల్సిన ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో గుండె జబ్బులు రావు. హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. నెయ్యిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు నొప్పి, మలబద్దకం అసలు ఉండవు. అలాగే పేగులు, జీర్ణాశయం శుభ్రంగా మారుతాయి. నెయ్యిని తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చు. అలాగే బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా ఉంటాయి. జ్వరం నుంచి ఉపశమనం లభిస్తుంది.
నెయ్యిని తీసుకోవడం వల్ల మన శరీరానికి అనేక రకాల విటమిన్లు లభిస్తాయి. ముఖ్యంగా నెయ్యిలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే నెయ్యిలో ఉండే విటమిన్ ఇ పురుషుల్లో వచ్చే శృంగార సమస్యలను తగ్గిస్తుంది. శిరోజాలను, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే నెయ్యిని తినడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఇందులో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. కనుక నెయ్యిని తింటే క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు.
నెయ్యిని పైపూతగా రాయడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి. గజ్జి, తామర, దురద, దద్దుర్లు తగ్గిపోతాయి. చర్మం కాంతివంతంగా, తేమగా, మృదువుగా మారుతుంది. అలాగే మొటిమలు, మచ్చలు ఉండవు. కాలిన గాయాలు లేదా ఇతర గాయాలు, పుండ్లు తగ్గిపోతాయి. నెయ్యిలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఇది గాయాలు అయినప్పుడు రక్తం గడ్డ కట్టేందుకు సహాయ పడుతుంది. దీంతో తీవ్ర రక్త స్రావం జరగకుండా ఆపవచ్చు. అలాగే నెయ్యిలో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది. చిన్నారుల్లో ఎముకల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీంతో చిన్నారుల్లో ఎదుగుదల లోపాలు రాకుండా ఉంటాయి.
ఇక థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు నెయ్యిని తినడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగు పరుచుకోవచ్చు. అలాగే నెయ్యిని తింటే బరువును తగ్గించుకోవచ్చు. దీన్ని తినడం వల్ల బరువు పెరుగుతామని అపోహ చెందుతారు. కానీ అందులో ఎంతమాత్రం వాస్తవం లేదు. రోజూ పరిమిత మోతాదులో నెయ్యిని తింటే బరువు పెరగరు. బరువు తగ్గుతారు. అలాగే శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. స్త్రీలు రుతు సమయంలో వచ్చే ఇబ్బందులను తప్పించుకోవాలంటే రోజూ నెయ్యిని తినాలి. అలాగే నెయ్యిని తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. అజీర్ణం తగ్గుతుంది. రుచి చూసే శక్తి పెరుగుతుంది. దీంతో రుచులను ఆస్వాదించగలుగుతారు. ఇలా నెయ్యితో అనేక లాభాలు ఉంటాయి. కనుక నెయ్యిని రోజూ అన్నంలో మొదటి ముద్దలో తినాల్సిందే. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…