Pathu Thala : శింబు న‌టించిన ప‌తు త‌లా మూవీ రివ్యూ.. ఓటీటీలో ఉంది..!

Pathu Thala : ఇటీవ‌ల ఓటీటీలోను వైవిధ్య‌మైన సినిమాలు అందుబాటులోకి వ‌స్తున్నాయి. అవి ప్రేక్ష‌కుల‌కి మ‌స్త్ మ‌జాని అందిస్తున్నాయి. క‌థ ఇంట్రెస్టింగ్‌గా ఉండ‌డంతో అవి హీట్ కూడా అవుతున్నాయి. గత నెలలో థియేటర్లలోకి వచ్చిన తమిళ మూవీ ప‌తు త‌లా తాజాగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా తెలుగు డబ్బింగ్ లో అందుబాటులోకి రాగా, చిత్ర క‌థ ఏంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఆరోగ్య పథకాన్ని ప్రారంభించ‌గా, ఆ రోజు రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కిడ్నాప్ అవుతారు. దీనికి కారణం ఏజీఆర్ (సింబు) అని అందరూ అనుమానిస్తూ ఉంటారు.

గుండాగా పనిచేస్తున్న ఓ అండర్ కవర్ పోలీస్ ని ఏజీఆర్ గ్యాంగ్ లో చేర‌గా, ఆ పోలీస్..ఏజీఆర్ ర‌హ‌స్యాలని కనిపెట్టాడా? ముఖ్యమంత్రి మిస్సింగ్ కి కారణమేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఓ పవర్ ఫుల్ డాన్ చేస్తున్న అక్రమాలని బయటపెట్టిన అండర్ కవర్ పోలీస్ స్టోరీనే ఈ ‘పతు తలా’ చిత్రం. తెలుగు ప్రేక్షకులు ఈ తరహా సినిమాల్ని ఇప్పటికే చాలా చూశారు. ‘పతు తలా’ అలా తీసినప్పటికీ ఓ రకంగా బాగానే ఉంది. రౌడీ గుణ(గౌతమ్ కార్తీక్), తహశీల్దార్ లీల (ప్రియా భవానీ శంకర్) మధ్య ఫస్టాప్ లో చూపించిన లవ్ స్టోరీ కాస్త ఇబ్బందిగా మారింది. ఆ పార్ట్‌పై మ‌రి కొంత దృష్టి పెడితే బాగుండేది.

Pathu Thala movie review available in ott
Pathu Thala

ఫస్టాప్ కొన్నికొన్నిచోట్ల బోరింగ్ గా అనిపించినా.. సెకండాఫ్ లో శింబు తన యాక్టింగ్ తో చాలావరకు కవర్ చేసేశాడు. చివర్లో వచ్చే అన్న-చెల్లి సెంటిమెంట్ ని టక‌ట‌కా లాగించేశారు. శింబు, డాన్ గా గడ్డంతో డిఫరెంట్ లుక్ లో ఆకట్టుకున్నాడు. ప్రతినాయక లక్షణాలున్న పాత్రలో గౌతమ్ మేనన్ పర్వాలేదనిపించాడు. హీరోయిన్ గా చేసిన ప్రియా భవానీ శంకర్ తోపాటు మిగతా పాత్రధారులు త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఇక ఏఆర్ రెహమాన్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ని సరిగ్గా వాడుకోలేక‌పోయారు. డైరెక్టర్ ఒబెలి కృష్ణ పెద్దగా కష్టపడలేదనే చెప్పాలి. సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. మొత్తంగా చూసుకుంటే ఈ చిత్రం ఓటీటీలో టైమ్ పాస్ మూవీ అని చెప్పాలి.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago