Pakeezah : తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 150 సినిమాలకు పైగా నటించి స్టార్ లేడీ కమెడియన్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది పాకీజా… అలియాస్ వాసుకి. అన్ని సినిమాలు చేసినా కాని.. అనుకోని కష్టాలవల్ల డబ్బంతా ఆవిరైపోయి చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంది నటి పాకీజా. కడుపునిండా తిండి కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న సమయంలో ఆమె తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరించింది. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ హీరోలు ఆమెకు తోచినంత సాయ చేశారు. నాగబాబు గారు చేసిన సాయం చాలా పెద్దది. మెగా ఫ్యామిలీ కాళ్లను పట్టుకోవాలని ఉంది. ఆ మధ్య మోహన్ బాబుగారికి కూడా మెసేజ్ పెట్టాను. ఆ సమయంలో ఆయన ‘లండన్’ లో ఉన్నట్టుగా చెప్పారు. అక్కడి నుంచి వచ్చిన తరువాత మాట్లాడదామని అన్నారు. ఇక నా పరిస్థితి తెలిసి సీరియల్స్ లోను .. సినిమాల్లోను ఛాన్సులు ఇస్తున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు పాకీజా.
చిరంజీవి సైతం పాకీజాకి సాయం చేసిన విషయం తెలిసిందే. ఆమెకు సినిమాలు, సీరియల్స్‌లో అవకాశాలు ఇవ్వాలనికోరారు. ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి స్పందించారో.. పాకీజాకి వరుస ఫోన్లు చేశారు. ఒక్కనెలలో ఆమె జీవితమే మారిపోయింది. ఇప్పుడు వరుస సినిమాలు, సీరియల్స్‌తో పాటు జబర్దస్త్‌లోనూ అవకాశం వచ్చింది. అంతేకాదు.. చాలామంది దాతలు స్పందించి.. పాకీజాను ఆర్ధికంగా ఆదుకోవడంతో పాకీజా.. మెగా ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ కన్నీటిపర్యంతం అయ్యింది.
పవన్ కళ్యాణ్ జనసేనలోకి పోతా.. అన్నయ్య తరపున ప్రచారం చేస్తా.. గ్రామ గ్రామాలు తిరుగుతా. మీటింగ్‌లలో పాల్గొన్ని ప్రచారం చేస్తా. వాళ్లు పెద్దవాళ్లు.. ఒప్పుకుంటే తప్పకుండా జనసేనలోకి వెళ్తాను అంటూ పాకీజా ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం తాను సినిమాలు, వెబ్ సారీస్‌లతో బిజీగా ఉందట. ఇప్పుడిప్పుడే ఆమె ఆర్ధికంగా స్థిరపడుతుంది. ఇంతలోనే రాజకీయాల్లోకి వస్తా అని చెప్పడం కాస్త అత్యాశే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ తరుపున ప్రచారం చేస్తా అంటే బాగుండేది కానీ.. జనసేనలోకి వెళ్తా అని చెప్పడం విమర్శలకు తావిచ్చేట్టు అయ్యింది. చూడాలి మరి పాకీజా రానున్న రోజులలో ఎలాంటి అడుగులు వేస్తుందో.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…