Nuvvu Naku Nachav Pinky : నువ్వు నాకు న‌చ్చావ్ పింకీ గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

Nuvvu Naku Nachav Pinky : ఐదు సంవత్సరాల వయస్సులోనే సినీ మాయ ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఆమె ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ కు ఉండే క్రేజ్ ని సంపాదించింది. అందరి మనస్సులోనూ చెరగని ముద్ర వేసింది. ఆమె ఎవరో కాదు సుదీప అలియాస్ పింకీ. సుదీప కంటే పింకీ అంటేనే అందరికీ తెలుస్తుంది. సుదీప అసలు పేరు సుదీప రాపర్తి. 1987లో పశ్చిమగోదావరి జిల్లాలో పుట్టింది. 1992 లో మోహన్ బాబు హీరోగా నిర్మించిన యమ్. ధర్మరాజు M.A సినిమాలో రంభ చెల్లెలిగా సినీ రంగ ప్రవేశం చేసింది.

అప్పటికి సుదీప వయస్సు 5 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత 2001 లో వెంకటేష్, ఆర్తి అగర్వాల్ కాంబినేషన్ లో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆర్తి అగర్వాల్ చెల్లెలుగా నటించింది. ఆ సినిమాలో ఆమె పోషించిన పాత్ర పేరు పింకీ. ఆ పాత్రలో ఆమె నటనకు, డైలాగ్స్ కి ప్రేక్షకులు మంత్రముగ్ధులు అయ్యారు. ఈ సినిమాలో ఆమె వెంకటేష్ ని వెంకటేశ్వర్లు అంటూ అట పట్టించటం అందర్నీ ఆకట్టుకుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుదీప పింకీగానే గుర్తుండిపోయింది. దాంతో ఆమె పేరు ఏకంగా పింకీగా మారిపోయింది. ఆమె మూడు సంవత్సరాల వయస్సులో నాట్య ప్రదర్శనలు ఇవ్వటం ప్రారంభించింది.

Nuvvu Naku Nachav Pinky see how is she now
Nuvvu Naku Nachav Pinky

పింకీ మంచి క్లాజికల్ డాన్సర్. సుదీప తండ్రి పేరు రాపర్తి సూర్యనారాయణ. తల్లి సత్యవతి. వీరిద్దరూ మంచి క్లాసికల్ డాన్సర్స్. వీరు సత్యశ్రీ అనే డాన్స్ అకాడమీని నడుపుతున్నారు. పింకీ తాత పేరు కిలాడి సత్యం. ఆయన కూడా మంచి డాన్సర్. అయన ఏకధాటిగా 42 గంటల పాటు డాన్స్ చేసి రికార్డ్ కూడా నెలకొల్పారు. ఇంత మంచి డాన్సర్ లు ఉన్న ఇంటిలో పుట్టిన సుదీప చిన్నతనం నుండే డాన్స్ నేర్చుకుంది. ఆమె సినిమాల్లో కన్నా ముందుగా దేశ విదేశాల్లో ఎన్నో నాట్య ప్రదర్శనలు ఇచ్చింది. సినిమాల్లో ఎక్కువగా చెల్లి పాత్రలే వచ్చాయి. అల్లుడుగారు వచ్చారు, నీ స్నేహం, గుడుంబా శంకర్, బొమ్మరిల్లు, మిస్టర్ ప‌ర్‌ఫెక్ట్ వంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది.

ఆమె తమిళ్ సినిమాల్లో కూడా చెల్లి పాత్రలను వేసింది. ఆమె దాదాపుగా 30 సినిమాల్లో నటించింది. ఆమె 2014 తర్వాత కొంతకాలం కనిపించకుండా పోయింది. ఆ తర్వాత పింకీకి శ్రీరంగనాథ్ తో వివాహం జరిగింది. ఆమెకు ఇప్పుడు ఒక కూతురు ఉంది. పెళ్లి తర్వాత సినిమా అవకాశాలు తగ్గటంతో సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెరపై ప్రారంభించింది. ప్రస్తుతం టీవీ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago