Niharika Konidela : మెగా బ్రదర్ నాగబాబు ముద్దులు కూతురు నిహారిక విడాకులకి సంబంధించి కొన్నాళ్లుగా అనేక ప్రచారాలు నడుస్తున్నాయి. భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక విడిపోతున్నారని.. ఈ ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం.. చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి పెళ్లి ఫొటోలను డిలీట్ చేయడంతో వీరు విడిపోవడం ఖాయం అని కొందరు జోస్యాలు కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ వార్తల నేపథ్యంలో నిహారిక ఇప్పుడు నెట్టింట మళ్లీ యాక్టివ్‌గా మారిపోయింది. సుమారు 3 నెలల తర్వాత సోలో స్టిల్‌తో అందరి ముందుకొచ్చింది నిహారిక.
రెడ్ ఆరెంజ్ హాఫ్ శారీలో నిహారిక తెలుగుదనం ఉట్టిపడే లుక్‌లో మెరిసిపోతూ ఫొటోషూట్ చేసింది. ఈ స్టిల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ఇప్పుడీ స్టిల్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. హాఫ్ శారీలో నిహారిక సోలో గా కనిపించడంతో.. ఇక ప్రొఫెషనల్ కెరీర్‌పై ఫోకస్ పెట్టబోతున్నట్టు పరోక్షంగా చెప్పేస్తుందంటున్నారు సినీ జనాలు. ఈ ఫొటోషూట్ ఎందుకు చేశారు అనే విషయం పక్కన పెడితే ఫొటోల్లో నిహారిక మాత్రం చాలా అందంగా కనిపిస్తున్నారు.
నిహారిక ఫొటోలను చూసి మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫొటోలు చాలా బాగున్నాయని కొందరు పొగడ్తలు కురిపిస్తున్నారు. మొత్తానికి చాలా రోజుల తరవాత నిహారిక పోస్ట్ పెట్టిందని మెగా అభిమానులు ఆనందపడుతుంటే.. మరి కొందరు ఆమె విడాకుల అంశంపై ఆరాలు తీస్తున్నారు. సినిమాల పరంగా నిహారిక ఫెయిల్ అయింది. కానీ బుల్లితెర, ఓటీటీలపై మాత్రం నిహారిక సక్సెస్ అయింది. వెబ్ సిరీస్‌లతో తన అభిరుచిని చాటుకుంది. ఈ అమ్మడు నటిగా కన్న నిర్మాతగానే ఎక్కువగా సక్సెస్ అయింది. చూస్తుంటే రానున్న రోజులలో మంచి సినిమాలు నిర్మించేలా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…