Niharika Konidela : మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక కొద్ది రోజులుగా తన విడాకుల విషయంతో వార్తలలో నిలుస్తుంది. తన భర్త నుండి నిహారిక విడిపోయిందని ప్రచారాలు సాగుతున్నా కూడా దీనిపై వారిరివురు ఏ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే చాలా ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి వచ్చిన నిహారిక ఒకవైపు యాంకర్‌గా, మరోవైపు నటిగా అలరించింది. 2016లో వచ్చిన ఒక మనసు సినిమాతో వెండితెరపై హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో హీరోగా నాగ శౌర్య నటించిన విషయం తెలిసిందే.
మొదటి సినిమా ప్లాప్ కావడంతో గ్లాండ్ గా ఎంట్రీ ఇవ్వలేకపోయింది ఈ బ్యూటి. త ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ వంటి చిత్రాలు చేసింది. కానీ, ఇవి కూడా నిహారికకు ఒక్క విజయాన్ని కూడా ఇవ్వలేదు. ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల హీరోయిన్ గా చివరిగా ఓ మంచి రోజు చూసి చెప్తా అనే సినిమాలో నటించింది. ఇందులో విలక్షణ నటుడు, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించాడు. ఇదే కాకుండా చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమాలోనూ ఒక పాత్రలో మెరిసింది ఈ అమ్మడు. అయితే నిహారిక ప్రస్తుతం వెబ్ సిరీస్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
నిహారిక విడాకుల గురించి కొన్నాళ్లుగా అనేక ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె సోషల్ మీడియాపై నెటిజన్స్ ఓ కన్నేసి ఉంచుతున్నారు. రీసెంట్‌గా ఆమె చీరకట్టులో సన్నింగ్ లుక్‌తో దర్శనమిచ్చింది. ఇక తాజాగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న ఫొటోస్ ని నిహారిక పంచుకుంది. నిహారిక తన ఫిట్నెస్ ట్రైనర్ తో సెల్ఫీ తీసుకున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అలాగే వరుణ్ సందేశ్ సతీమణి నటి వితిక షెరు కూడా అదే జిమ్ లో వర్కౌట్స్ చేస్తోంది. నిహారిక ఆమెతో కూడా సెల్ఫీలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం నిహారిక జిమ్ వర్కవుట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…