Niharika And Varun Tej : రాఖీ పండగ వచ్చిందంటే చాలు.. మనకు తెలియకుండానే ఇంట్లో అక్కా చెల్లెళ్ల సందడి తెగ కనిపిస్తుంటుంది. ఆ రోజు వచ్చిందంటే ఎప్పుడెప్పుడు వచ్చి మన సోదరిమణులు చేతికి రాఖీ కడతారా అని వేచి చూస్తుంటాం. మాటల్లో చెప్పలేని మధురానుభూతి అది. ఏడాదిలో ఒక్కరోజు చెల్లి కానీ.. అక్క గానీ వచ్చి సోదరుడితో తనకు కావాల్సిన బహుమతిని తీసుకుని వెళ్తుంది. సోదరికి ప్రేమతో పాటు బహుమతి కూడా ఇస్తుంటే ఆ సంతోషాన్ని మాట్లో వర్ణించలేం. తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా మంది హీరోలకు సొంత అక్క.. చెల్లెళ్లు ఉన్నారు. అందులో చాలా మంది ఎలా ఉంటారో ప్రేక్షకులకు తెలియదు. మరి వాళ్ల వివరాలేంటో.. ఎలా ఉంటారో.. వాళ్ల మధ్య బాండింగ్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
టాలీవుడ్ మెగా బ్రదర్స్ ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. మాధవి రావు.. విజయదుర్గ. చిరు పెద్ద చెల్లి మాధవి రావు బయట పెద్దగా కనిపించదు. కానీ చిన్నచెల్లి విజయదుర్గ మాత్రం ప్రేక్షకులకు కూడా పరిచయమే. ప్రతీ రాఖీకి ఇప్పటికీ చిరు తన సోదరీమణులను కలిసి ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటాడు. ఇక వరుణ్ తేజ్, నిహారిక గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వీళ్లిద్దరి మధ్య ఎంత మంచి బాండింగ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రోజు తన అన్నయ్య వరుణ్ తేజ్‌కి నిహారిక రాఖీ కట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్‌గా మారాయి.
ఇటీవల నిహారిక గురించి వరుణ్ తేజ్ కి ఓ ప్రశ్న ఎదురైంది. లావణ్య త్రిపాఠి, నిహారిక ఇద్దరి నుండి ఒకేసారి ‘అర్జెంటు ఫోన్ చెయ్’ అని మెసేజ్ వస్తే ముందు ఎవరికి కాల్ చేస్తావ్ అని యాంకర్ సుమ అడిగారు. ఈ ప్రశ్నకు వరుణ్ తేజ్ తడుముకోకుండా సమాధానం చెప్పాడు. నిహారికకు చేస్తాను. ఎందుకంటే తాను చిన్న పిల్ల కదా అన్నాడు. లావణ్య సమస్యను హ్యాండిల్ చేయకలదు. నిహారిక వల్ల కాదు. అందుకే ముందు నిహారికకు ఫోన్ చేస్తానన్న అర్థంలో వరుణ్ తేజ్ సమాధానం చెప్పాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…