Neha Shetty : ఇటీవల సినిమా ప్రమోషన్స్ హద్దులు దాటాయి. స్టేజ్ మీద హీరో హీరోయిన్స్ రెచ్చిపోతూ నానా రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియాను వినియోగించుకుని సినిమాను ప్రమోట్ చేయడం వేరు… సోషల్ మీడియాలో నానటం వేరు. ఇద్దరు కుర్ర హీరోలు చేసిన పని అచ్చం ఇలాగే ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ ఇద్దరూ కూడా తమ సినిమాను ప్రమోట్ చేయడానికి కొత్త పంథా ఎంచుకున్నారు. ‘ఖుషి’ మ్యూజికల్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ సమంత ఇద్దరు కలిసి స్టేజీ మీద డ్యాన్స్ వేశారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ .. తరువాత విజయ్ దేవరకొండ తన షర్ట్‌ను విప్పి మరి సమంతను ఎత్తుకుని తిప్పడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
విశ్వక్ సేన్ కొత్త చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాలో డీజే టిల్లు ఫేం నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ‘సుట్టంలా సూసి పోకల’ పాటను విడుదల చేశారు. ఈ ఈవెంట్‌లో హీరో విశ్వక్ సేన్ , హీరోయిన్ నేహాశెట్టి స్టేజీ మీదనే రెచ్చిపోయి రొమాంటిక్‌గా డ్యాన్స్ చేశారు. నేహా శెట్టి తన చీరను విప్పి మరి హీరోకు కప్పుతుంది. హీరో విశ్వక్ సేన్ నేహా శెట్టి చీరను చుట్టుకుంటూ నేహాను హత్తుకుంటాడు. ఆ ఘటనపై కూడా విమర్శలు వస్తున్నాయి. సాంగ్ లాంచ్‌కు వచ్చి ఇలా చేయడం ఏంటని హీరో , హీరోయిన్లను కొందరు ప్రశ్నిస్తున్నారు.
స్టేజీపై సాంగ్ బీట్ స్టార్ట్ కాగానే నేహా శెట్టి కొంగు లాగుతూ డ్యాన్స్ షురూ చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. పబ్లిసిటీ కోసం ఇంతలా తెగిస్తారా అనేది కొందరి వాదన అయితే.. ఇదేదో కొత్తగా ఉందిగా.. లీడ్ పెయిర్స్ లైవ్ పర్‌ఫార్‌మెన్స్ అదుర్స్ అనేవారు ఇంకొందరు. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కాలేజీలో విద్యార్థుల నడుమ ఈ సాంగ్ విడుదల చేశారు. ఈ ఈవెంట్‌లో విశ్వక్ సేన్‌తో పాటు హీరోయిన్ నేహా శెట్టి, చిత్ర దర్శకుడు కృష్ణ చైతన్య, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, సింగర్ అనురాగ్ కులకర్ణి, సహ నిర్మాతలు పాల్గొన్నారు.