Nayanthara : శింబు, ప్రభుదేవాలతో బ్రేకప్ అయిన తర్వాత నయనతార.. విఘ్నేశ్ శివన్ తో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసి ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత వీరి పరిస్థితి ఏం బాగోలేదు. ఏదో ఒక వివాదం వీరిని చుట్టుముడుతూనే ఉంది. తిరుమలలో చెప్పులు ధరించి నడిచిందని అప్పట్లో పెద్ద ఇష్యూ కాగా, ఆ తర్వాత అద్దె గర్భం ద్వారా కవల మగపిల్లలకు జన్మనిచ్చింది నయన్. అది చట్టబద్దం కాదని, నయనతార అరెస్ట్ తప్పదని ఒక నెలపాటు కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే తగిన ఆధారాలు చూపించి నయనతార దంపతులు ఆ వివాదం నుంచి బయటపడ్డారు.
ఇప్పుడు ఈ జంట మరోసారి వైరల్ అయ్యింది. విగ్నేష్ శివన్ తల్లి మీనా కుమారి తన కొత్త కోడలు నయనతారపై ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేసింది. అత్తయ్య కామెంట్స్ తో నయనతార పేరు మరోసారి సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. మా అబ్బాయి మంచి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్, నా కోడలు ఓ స్టార్ హీరోయిన్. వాళ్లు ఇద్దరూ చాలా కష్టపడతారు. కోడలు అయితే మంచి మనసు ఉన్న అమ్మాయి. వాళ్ల ఇంట్లో పని చేసే ఒకళ్లు రూ.4 లక్షల అప్పు తీర్చలేక ఎన్నో ఇబ్బందులు పడుతుండగా.. ఆ విషయం తెలుసుకుని వాళ్ల అప్పు నయనతారే తీర్చేసింది.

నయనతారకు ఇల్లును చక్కబెట్టడం, పెద్దవారి ఆలనా పాలనా, క్షేమం చూసుకోవడం బాగా తెలుసు. 10 మంది మనుషులు చేసే పని నయనతార ఒక్కతే చేస్తుంది. మేం మా పిల్లలకు కష్టపడటం నేర్పాం. నయనతార కూడా అలాగే కష్టపడటం తెలిసిన అమ్మాయి. నయనతార, విగ్నేష్ వారి వృత్తిని గౌరవిస్తారు. అందులో ఉన్నత స్థానం చేరుకునేందుకు కృషి చేస్తారు, అని విగ్నేష్ తల్లి మీడియాతో చెప్పుకొచ్చింది. నయనతార గురించి ఆమె అత్త చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. నయనతార ముఖ్యంగా చేతినిండా పాన్ ఇండియా లెవల్లో ప్రాజెక్టులతో ఫుల్ బిజీ అయిపోయింది. తమిళ్, మలయాళం, హిందీ సినిమాలు చేస్తోంది.