Narasimha Naidu Movie : బి.గోపాల్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం నరసింహనాయుడు. ఈ సినిమా జనవరి 12, 2001లో సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ బరిలో దిగింది. ఈ సినిమాలో బాలయ్య సరసన సిమ్రాన్, ప్రీతి జింగానియా, ఆశాసైని హీరోయిన్స్ గా నటించారు. కె.విశ్వనాథ్, అచ్యుత్, తనికెళ్ల భరణి, జయప్రకాశ్ రెడ్డి, ముఖేష్ రిషి, సత్య ప్రసాద్, బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా నటించారు. మణిశర్మ అందించిన సంగీతం ఈ చిత్రానికి మరో హైలెట్ అని చెప్పవచ్చు.
బాలయ్య కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నప్పటికీ ఈ సినిమాకి ఒక ప్రత్యేకం స్థానం ఉంది అని చెప్పాలి. సంక్రాంతి బరిలో దిగిన నరసింహనాయుడు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ కథను అందించగా పరుచూరి గోపాలకృష్ణ మాటల రచయితగా వ్యవహరించారు. అప్పట్లో రికార్డులు సృష్టించిన ఈ సినిమాకు పాతిక కోట్లకు పైగా కలక్షన్స్ ని రాబట్టుకుంది.
అయితే ఈ సినిమా సెట్స్ పైకి రాకముందు తెర వెనక చాలా కథ జరిగిందట. బాలకృష్ణ బి.గోపాల్ కాంబినేషన్ లో అప్పటికే రెండు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. దాంతో ఈ సినిమా వారి కాంబినేషన్ లో వచ్చిన మూడోవా సినిమా. అయితే నిజానికి ఈ సినిమా కంటే ముందు బి.గోపాల్, పోసాని కృష్ణ మురళి అందించిన కథతో అయోధ్య రామయ్య అనే సినిమాను తీయాలని అనుకున్నారు. ఈ సినిమాకు ముహూర్తపు షాట్ ను కూడా తీశారు. హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో సినిమా షూటింగ్ ను ప్రారంభించగా అక్కడకు బాలయ్య బాబు అభిమానులు భారీ ఎత్తున చేరుకున్నారు. బాలయ్య బి. గోపాల్ కాంబినేషన్ లో రెండు బ్లాక్ బస్టర్ లు తీయడంతో మూడో సినిమా కచ్చితంగా హిట్ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు. దాంతో బి.గోపాల్ మళ్ళీ ఆలోచనలో పడ్డారు. వెంటనే రచయిత చిన్నికృష్ణ కు ఫోన్ చేసి కథ కావాలని అడిగారట.
రచయిత చిన్నికృష్ణ బీహార్ లో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా తయారు చేసిన కథను బి.గోపాల్ కు వినిపించడం జరిగిందట. బి.గోపాల్ చిన్నికృష్ణ కలిసి అదే కథను పరుచూరి బ్రదర్స్ కు సైతం వినిపించారు. ఇక ఆ కథకు బాగా నచ్చడంతో కొన్ని మార్పులు చేర్పులు చేసి నరసింహ నాయుడు సినిమాను తెరకెక్కించారు. అంతే కాకుండా పోసాని కృష్ణ మురళీ రాసిన అయోధ్య రామయ్య సినిమా కథను పక్కన పెట్టేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…