Nara Lokesh : చంద్రబాబు అరెస్ట్ తర్వాత నారా లోకేష్ యువగళంకి బ్రేక్ ఇచ్చి తన తండ్రిని జైలు నుండి బయటకు తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల కేసులో ఏపీ సీఐడీ అధికారులు టీడీపీ నేత నారా లోకేష్ ను దాదాపు ఆరున్నర గంటల పాటు విచారించారు. ఇందులో ఆయన్ను అమరావతి రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పుతో పాటు పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. మధ్యలో ఓ గంట లంచ్ బ్రేక్ ఇచ్చి మిగతా సమయంలో ప్రశ్నలు అడిగారు. న్యాయవాది సమక్షంలోనే జరిగిన ఈ విచారణపై బయటికి వచ్చిన తర్వాత నారా లోకేష్ వివరాలు వెల్లడించారు. తనను మొత్తం 50 ప్రశ్నలు అడిగారని నారా లోకేష్ తెలిపారు.
ఇందులో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కేవలం ఒకే ప్రశ్న అడిగారని, మిగతా ప్రశ్నలు ఇతరత్రా అంశాలపైనే అడిగారని తెలిపారు. దాదాపు ఆరున్నర గంటల పాటు విచారణ సాగిందన్నారు. 50 ప్రశ్నల్లో ఒక్కటి కూడా కుటుంబ సభ్యులకు ఎలా లబ్ది జరిగిందని అడగ లేదన్నారు. హెరిటేజ్ లో డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఏం జరిగిందో అడిగారని లోకేష్ తెలిపారు. కక్ష సాధింపు తప్ప…ఎలాంటి ఆధారాలు లేకుండా దొంగ ఎఫ్ఐఆర్ లు పెట్టారని ఆరోపించారు. ప్రజల్లోకి వెళ్లకుండా తనను అడ్డుకున్నారని విమర్శించారు. గూగుల్ లో దొరికే ప్రశ్నలకి సమాధానాలు కూడా నన్ను అడిగారని లోకేష్ చెప్పుకొచ్చారు.
ఇక రెండో రోజు విచారణకి హజరైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీవీ9, ఎన్టీవీ, సాక్షిపై అసహనం వ్యక్తం చేశాడు. వీరు తప్ప ఎవరు కూడా తన గురించి నెగెటివ్‌గా చెప్పరని అన్నాడు. అలానే అంబంటి రాంబాబుపై కూడా నిప్పులు చెరిగారు లోకేష్.పోలవరం కట్టమంటే పోయి సంజనా పక్కలో దూరతాడు అనేలా గట్టిగా ఇచ్చిపడేసాడు. ప్రస్తుతం నారా లోకేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. అతని కామెంట్స్‌ని కొందరు సమర్ధిస్తుండగా, మరి కొందరు ఫైర్ అవుతున్నారు.