Brahmanandam : పెళ్లి చూపులు , ఈ నగరానికి ఏమైంది వంటి బంపర్ హిట్ల తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంతో వస్తున్న తాజా చిత్రం ‘కీడా కోలా’. ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్, బ్రహ్మనందం, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సరికొత్త క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ దగ్గుబాటి రానా సమర్పణలో నవంబర్ 03న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ మూవీకి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సినిమా నుంచి టీజర్ విడుదల కాగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ టైటిల్ లోని కీడా అంటే బొద్దింక అని అర్ధం. టీజర్ లో ఈ కీడా ఒక కోలాలో చిక్కుకొని కనిపిస్తుంది.
మూవీ స్టోరీ మొత్తం ఈ కీడా అండ్ కోలా చుట్టూ సాగబోతుందని టీజర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాలో నటీనటులు విషయానికి వస్తే.. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ‘వరదరాజు’ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. యూరిన్ బ్యాగ్ అటాచ్‌మెంట్ తో వీల్ చైర్ కే అంకితమైన పాత్రలో అలరించబోతున్నాడు. అలాగే ’30 వెడ్స్ 21′ వెబ్ సిరీస్ లో నటించిన చైతన్య రావు ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. డాన్ రోల్ లో తరుణ్ భాస్కర్ కనిపించబోతున్నాడు. క్రైమ్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. బ్రహ్మి ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించడంతో ఈ సినిమా పై ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీ నెలకుంది.
తాజా ఇంటర్వ్యూలో బ్రహ్మానందం చిత్ర యూనిట్‌తో కలిసి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. అలానే తరుణ్ భాస్కర్ గురించి చెబుతూ.. ఆయన సెట్స్ లోకి వచ్చినప్పుడు తరుణ్ భాస్కర్ అని అన్నాడు. అయితే ఏంటని అన్నాను. నేనేదో కామెడీ చేద్దామనుకుంటే తుస్ మంది. ఇక నన్ను వీల్ చైర్ లో కూర్చోపెట్టి చాలా హంగామా చేశారు. ఒక బొమ్మతో సంసారం అంట, ఏంటో అంతా కొత్తగా చేసారు. తరుణ్ భాస్కర్ మంచి టాలెంటెడ్ ఉన్న వ్యక్తి. సినిమా మంచి హిట్ అవుతుందని బ్రహ్మానందం అన్నారు. అలానే ఆయన నాన్‌స్టాప్ పంచ్‌లు తెగ నవ్విస్తున్నాయి.