Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత నారా లోకేష్ టీడీపీ బాధ్యతలని తనపై వేసుకున్నాడు.తన తండ్రిని బెయిల్‌పై బయటకు తీసుకొచ్చేందుకు నారా లోకేష్ ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబుపై స్టెరాయిడ్లు ప్రయోగించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని నారా లోకేష్ అన్నారు. ప్రభుత్వ వైద్యులు, జైలు యంత్రాంగం వాస్తవాలు దాస్తోందన్నారు. చంద్రబాబుకి ఏదైనా హాని జరిగితే, అందుకు సీఎం జగన్మోహన్ రెడ్డిదే బాధ్యత అన్నారు. చంద్రబాబు ప్రాణాల పట్ల దురుద్దేశంతో కుట్రలు పన్నారని లోకేష్ ఆరోపించారు. జైల్లో ఆయనకు తగిన భద్రత లేనందున ఆయన ఎంతో ప్రమాదంలో ఉన్నారన్నారు.
దోమలు, కలుషిత నీరు, బరువు తగ్గడం, ఇన్‌ఫెక్షన్‌లు, అలర్జీలు ఉన్నా సకాలంలో వైద్య సహాయాన్ని అందించట్లేదని వాపోయారు. చంద్రబాబు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని నారా లోకేష్ తెలిపారు. ఇక బుధవారం సీఐడీ విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన నారా లోకేష్..సాక్షి రిపోర్టర్‌కి గట్టి పంచ్‌లు ఇచ్చారు. సాక్షి ప్రతినిధి వేసిన ప్రశ్నకు ఆయన ఓపికగానే కౌంటర్ ఇచ్చారు. ఏంటమ్మా… చెప్పమ్మా సాక్షి, ఏమో సాక్షి కదా… నీకు జీతం ఎక్కువ కడుతున్నారట కదా, మీ జీతాలు పెరిగాయా లేదా చెప్పు అని ప్రశ్నించారు. హెరిటేజ్ గురించి ప్రశ్నించగా… బ్రదర్ అలా అనవద్దు, అనవసర ఆరోపణలు చేయవద్దు అంటూ సాక్షి ప్రతినిధిని ఉద్దేశించి అన్నారు. హెరిటేజ్ సంస్థ 1992లో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రారంభమైందని, 1994లోనే లిస్టింగ్ అయిందని చెప్పారు. దీనికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయన్నారు.
పది రూపాయల షేర్‌ను దొడ్డిదారిన రూ.350కి చేయలేదని సాక్షి మీడియాను ఉద్దేశించి అన్నారు. తాను సూటిగా ప్రశ్నిస్తున్నానని, దమ్ము ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలన్నారు. అవసరమైతే వెళ్లి భారతిరెడ్డిని అడుగు అని చురకలు అంటించారు. పది రూపాయల ముఖ విలువ కలిగిన షేర్‌ను రూ.350గా చేశారని సాక్షిపై విమర్శలు చేశారు. ప్రజాధనాన్ని లూటీ చేసి సాక్షి ఛానల్ అందరికంటే ఎక్కువ రేటింగ్ వేయించుకుంటోందని మండిపడ్డారు. వాలంటీర్లకు జీవో జారీ చేసి మరీ సాక్షి పేపర్ కొనాలని చెప్పారన్నారు. అందుకే జగన్‌కు, భారతి రెడ్డికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు. ఇది తెలుసుకో బ్రదర్ అని వ్యాఖ్యానించారు. లింగమనేని ఇల్లు మీకు ఎందుకు ఇచ్చారని సాక్షి ప్రతినిధి అడిగారు. దానికి లోకేశ్ స్పందిస్తూ… మేం క్విడ్ ప్రోకో కింద తీసుకోలేదని, దానికి న్యాయబద్ధంగా అద్దె చెల్లించామని చెప్పారు. అద్దె చెల్లించకుంటే క్విడ్ ప్రోకో అవుతుందని, కానీ చెల్లించాక క్విడ్ ప్రోకో ఎక్కడిది అన్నారు. రూ.10 ముఖ విలువ కలిగిన సాక్షి పత్రిక షేర్‌ను రూ.350కి కొంటే క్విడ్ ప్రోకో అవుతుందని నారా లోకేష్ చురకలు అంటించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…